ePaper
More
    Homeక్రీడలుGill double century | ద్విశ‌త‌కంతో గిల్ రికార్డ్.. భారీ స్కోరు దిశ‌గా భార‌త్

    Gill double century | ద్విశ‌త‌కంతో గిల్ రికార్డ్.. భారీ స్కోరు దిశ‌గా భార‌త్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gill double century | టెస్ట్ క్రికెట్‌లో శుభ్‌మ‌న్ గిల్ రికార్డులు తిర‌గ‌రాస్తున్నాడు. తొలి టెస్ట్‌లో అద్భుత‌మైన శ‌త‌కం సాధించిన గిల్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో (Second test match) ఏకంగా డ‌బుల్ సెంచ‌రీ సాధించాడు. ఇంగ్లండ్ పర్యటనతో టెస్టు సారథిగా ఎంపికైన గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (Captain innings) ఆడుతూ విమ‌ర్శ‌కుల‌కు గ‌ట్టి స‌మాధానం ఇస్తున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు (Edgbaston Test)లో జట్టును పటిష్ట స్థితిలో నిల‌ప‌డంలో గిల్ ప్ర‌ముఖ పాత్ర పోషించాడు. తొలి రోజు ఎంత ఏకాగ్ర‌త‌తో ఆడాడో రెండు రోజు కూడా అంతే ఏకాగ్రతతో ఆడి 200 పరుగులతో మరో రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ మీద 200 ప్లస్ కొట్టిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడీ యంగ్‌స్టర్.

    Gill double century | కెప్టెన్ ఇన్నింగ్స్

    ఇంగ్లండ్‌పై అత్యధిక స్కోర్ (highest score) బాదిన కెప్టెన్స్‌లో అజారుద్దీన్ ముందు స్థానంలో ఉన్నారు. ఈ బ్యాటర్ 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఆతిథ్య జట్టు బౌలర్లను ఉతికేసి 179 రన్స్ సాధించాడు. ఇప్పటి వ‌ర‌కు ఇంగ్లండ్ గడ్డపై భారత కెప్టెన్ (India captain) అత్యుత్తమ స్కోర్‌ ఇదే కాగా, ఇప్పుడు దానిని గిల్ (Shubhman Gil) బ‌ద్దలు కొట్టాడు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో (Anderson-Tendulkar Trophy) ఇండియన్​ కెప్టెన్ గిల్ పరుగుల వరద పారిస్తుండ‌గా.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిరోజే వంద రన్స్​తో ఇంగ్లండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. రెండోరోజు నిల‌క‌డ‌గా ఆడుతూ 200కి చేరువయ్యాడు. ప్ర‌స్తుతం 23 ఫోర్స్, 2 సిక్స‌ర్ల‌తో 201 నాటౌట్‌గా ఉన్నాడు. గిల్‌తో పాటు వాషింగ్ట‌న్ సుంద‌ర్ (23 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ క్ర‌మంలో భారత జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 6 వికెట్లు కోల్పోయి 500 ప‌రుగులు చేసింది.

    READ ALSO  INDvsENG | చ‌రిత్ర సృష్టించేందుకు రెండు వికెట్ల దూరంలో భార‌త్.. ఐదు వికెట్లతో ఆకాశ్ దూకుడు

    మ‌రోవైపు రెండో టెస్ట్‌లో జడేజా (Jadeja) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. 137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 89 పరుగులు చేసి ఔట‌య్యాడు. శుభ్‌మన్ గిల్‌తో (Shubham gill) కలిసి 6వ వికెట్‌కు 203 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో భారత్ సులువుగా 400 ప‌రుగులు సాధించింది. మ‌రోవైపు హాఫ్ సెంచ‌రీ ద్వారా డబ్ల్యూటీసీలో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు జ‌డేజా. 2021లో డబ్ల్యూటీసీ ప్రారంభమవ్వగా.. ఇప్పటి వరకు 41 మ్యాచ్‌లు ఆడిన జడేజా 25.92 సగటుతో 132 వికెట్లు తీయడంతో పాటు 2000 ప్లస్ రన్స్ చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఆటగాడు కూడా ఈ ఫీట్ సాధించలేదు. డ‌బ్ల్యూటీసీలో జడేజా ఇప్పటి వరకు మూడు సెంచరీలు చేయ‌డంతో పాటు బౌలింగ్‌లో ఆరు సార్లు 5 వికెట్ల ఘనతను సాధించాడు.

    READ ALSO  Karun Nair | ఒక్క ఛాన్స్ అన్నావ్.. నాలుగు ఛాన్స్‌లు ఇచ్చారు.. ఇక క‌రుణ్ నాయ‌ర్ స‌ర్దుకోవ‌డ‌మేనా..?

    Latest articles

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్​ ట్యాక్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు తీసుకోనిదే పనులు...

    More like this

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...