More
    Homeబిజినెస్​Pre Market Analysis | ఫెడ్‌ హెచ్చరికలతో ఎరుపెక్కిన మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌...

    Pre Market Analysis | ఫెడ్‌ హెచ్చరికలతో ఎరుపెక్కిన మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ఇన్ఫ్లెషన్‌(Inflation) విషయంలో అమెరికాకు చెందిన ఫెడ్‌ చేసిన కామెంటరీతో మార్కెట్లు ఎరుపెక్కాయి. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో యూఎస్‌(US), యూరోప్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిసినా.. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆసియా మార్కెట్లతోపాటు యూఎస్‌కు చెందిన డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం నష్టాలతో సాగుతోంది.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయన్న ఫెడ్‌ చైర్మన్‌ పొవెల్‌(Fed chairman Powell) ప్రకటనతో వాల్‌స్ట్రీట్‌లో బుధవారం ఇంట్రాడే లాభాలు హరించుకుపోయాయి. నాస్‌డాక్‌(Nasdaq) 0.13 శాతం లాభంతో ముగియగా.. ఎస్‌అండ్‌పీ 0.03 శాతం నష్టపోయింది. గురువారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.21 శాతం నష్టంతో సాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    యూరోప్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.11 శాతం లాభపడగా.. డీఏఎక్స్‌ 0.50 శాతం, సీఏసీ 0.36 శాతం నష్టపోయాయి.

    READ ALSO  Pre Market analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్‌లో గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.13 శాతం, హంగ్‌సెంగ్‌(Hang Seng) 0.95 శాతం, నిక్కీ 0.74 శాతం, కోస్పీ 0.52 శాతం, షాంఘై 0.31 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.24 శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.08 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 890 కోట్లు, డీఐఐలు రూ. 1,091 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.95 నుంచి 0.80కు తగ్గింది. విక్స్‌(VIX) 0.89 శాతం తగ్గి 14.28 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.43 శాతం తగ్గి 76.37 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 22 పైసలు పడిపోయి 86.47 వద్ద ఉంది.
    • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.14 శాతం పెరిగి 99.05 వద్ద ఉండగా.. యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.18 శాతం పెరిగి 4.40 వద్ద నిలిచింది.
    READ ALSO  Today Gold Price | దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. ఎంత త‌గ్గిందో తెలుసా?

    మార్కెట్‌ ఊహించినట్లుగానే అమెరికాకు చెందిన ఫెడ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అయితే ఫెడ్‌ చైర్మన్‌ పొవెల్‌ చేసిన ప్రకటనను మార్కెట్‌ నెగెటివ్‌గా తీసుకుంది. టారిఫ్‌(Tariff)ల విషయంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, మధ్యప్రాచ్యం(Middle east)లో ఉద్రిక్తతలతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయని పొవెల్‌ పేర్కొన్నారు. ఇది రేట్‌ కట్‌ను క్లిష్టతరం చేస్తుందన్న ఆయన వ్యాఖ్యలకుతోడు ఈ ఏడాది రేట్‌కట్‌ ఉండకపోవచ్చన్న ఫెడ్‌ సభ్యుల కామెంటరీతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

    మన మార్కెట్లను అస్థిరపరిచే అంశాలు దేశీయంగా లేకపోయినప్పటికీ అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా సాగే అవకాశాలున్నాయి. ముడి చమురు(Crude oil) ధరలు పెరుగుతుండడం మన ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

    Latest articles

    New Voter Card | 15 రోజుల్లోనే ఓటర్​ కార్డు.. ఈసీ కీలక మార్పులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:New Voter Card | ఎన్నికల సంఘం ఓటరు కార్డుల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది....

    Hyderabad | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​(Hyderabad) నగరంలోని పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొఘల్‌పురాలోని(Mughalpura)...

    Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Phone Tapping Case | తెలంగాణ(Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు పెంచింది....

    CM Revanth Reddy | ఢిల్లీకి సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి గురువారం ఉదయం ఢిల్లీ(Delhi) బయలుదేరారు. ఆయన వెంట రేవంత్‌...

    More like this

    New Voter Card | 15 రోజుల్లోనే ఓటర్​ కార్డు.. ఈసీ కీలక మార్పులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:New Voter Card | ఎన్నికల సంఘం ఓటరు కార్డుల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది....

    Hyderabad | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​(Hyderabad) నగరంలోని పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొఘల్‌పురాలోని(Mughalpura)...

    Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Phone Tapping Case | తెలంగాణ(Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు పెంచింది....