అక్షరటుడే, వెబ్‌డెస్క్: PRE MARKET ANALYSIS : గత ట్రేడింగ్ సెషన్‌లో యూఎస్(US), యూరోప్ మార్కెట్లు నెగెటివ్‌గా ముగిసినా.. గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు మాత్రం పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. బుధవారం అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ(S&P) 0.56 శాతం, నాస్‌డాక్ 0.51 శాతం నష్టపోయాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్(Dow Jones Futures) మాత్రం 1.4 శాతం లాభాలతో కొనసాగుతోంది.
నెగెటివ్‌గా యూరోప్ మార్కెట్లు.. బుధవారం డీఏఎక్స్(DAX) 0.78 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.6 శాతం నష్టపోగా.. సీఏసీ 0.50 శాతం పడిపోయింది.
PRE MARKET ANALYSIS : ఆసియా మార్కెట్లలో ర్యాలీ..
ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో
కోస్పీ 1.72 శాతం, నిక్కీ(Nikkei) 1.65 శాతం, షాంఘై 0.77 శాతం, హంగ్‌సెంగ్ 0.41 శాతం లాభాలతో ఉండగా.. స్ట్రెయిట్ టైమ్స్ మాత్రం 0.13 శాతం నష్టంతో కదలాడుతోంది. గిఫ్ట్ నిఫ్టీ 0.4 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
PRE MARKET ANALYSIS : గమనించాల్సిన అంశాలు..
- ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్(Trading session)లోనూ నెట్ బయ్యర్లుగా కొనసాగారు. ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 4,662 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐ(DII)లు నికరంగా రూ. 7,911 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- క్రూడ్ ఆయిల్ ధరకు రెక్కలొస్తున్నాయి. బ్యారెల్‌కు 1.33 శాతం పెరిగి 62.68 డాలర్లకు చేరింది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు తగ్గి 85.36 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.37 శాతం పెరిగి 100.24కు, యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 0.40 శాతం పెరిగి 4.50 కు చేరాయి.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.82 నుంచి 0.76కు తగ్గగా.. విక్స్(VIX) 2.79 శాతం తగ్గి 18.02 వద్ద ఉంది.
- అత్యవసర అధికారాల చట్టం కింద ఇతర దేశాలపై సుంకాలు(Tariffs) విధించకుండా మన్‌హట్టన్‌లోని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నిరోధించింది. దీంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడి ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి.