అక్షరటుడే ఇందూరు: Gazetted Head masters | జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో Zilla Parishad Government High School అర్ధాంతరంగా నిలిపేసిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల Gazetted Principals పదోన్నతులు కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ PRTU Telangana District President Kripal Singh కోరారు.
సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ TPCC President Mahesh Kumar Goud ను కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్టీ జోన్–1, –2 పరిధిలో గతేడాది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇస్తామని ప్రకటించి వేకెన్సీ లిస్ట్ Vacancy List కూడా తయారు చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు పదోన్నతులు కల్పించలేదని తెలిపారు.