More
    HomeజాతీయంGas leakage | వంట చేస్తుండ‌గా ఊడిన గ్యాస్ పైప్.. పెద్ద బ్లాస్టింగ్ నుంచి త‌ప్పించుకున్న...

    Gas leakage | వంట చేస్తుండ‌గా ఊడిన గ్యాస్ పైప్.. పెద్ద బ్లాస్టింగ్ నుంచి త‌ప్పించుకున్న మ‌హిళ‌.. వీడియో వైరల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Gas leakage | గ్యాస్ ప్రమాదంలో ఎంతో మంది మృతి చెంద‌డం మ‌నం చూశాం. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా కూడా ప్రాణాల‌కు పెద్ద రిస్క్. అయితే ఓ మహిళ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం త‌ప్పింది. వంట చేస్తుండగా స్టవ్​కు ఉన్న గ్యాస్‌ పైప్‌(Gas Pipe) ఒక్కసారిగా ఊడిపోయింది. దాంతో కిచెన్‌లో ఉన్న మహిళ తెలివిగా వ్యవహరించడంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. CCTV ఫుటేజ్‌ ఆధారంగా జూన్ 18న ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. వీడియోలో LPG సిలిండర్ పైపు లీక్(Cylinder pipe leak) అవుతోంది.

    Gas leakage | పెద్ద ప్ర‌మాదం తప్పింది..

    గ్యాస్‌ లీక్‌(Gas leak) అవుతున్న సిలిండర్‌, సహా పైప్‌ చేతిలో పట్టుకుని వంటింట్లోంచి బయటకు తీసుకువచ్చింది. గ్యాస్‌ లీకేజీని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ, ఆ మహిళ భారీ లీకేజీని ఆపలేకపోయింది. అంతలోనే సిలిండర్(Cylinder) నేలపై పడిపోయింది. దాని నుండి మరింత జోరుగా గ్యాస్ లీక్ అవుతోంది. కొన్ని నిమిషాల తర్వాత ఆమెకు సాయంగా మరో వ్యక్తి సంఘటనా స్థలానికి వచ్చాడు. ఆ ఇంటికి ఒక ద్వారం గుండా ఆ మహిళ, వేరే తలుపు ద్వారా ఆ వ్యక్తి వచ్చారు. వారిద్దరూ సిలిండర్ దగ్గరికి చేరుకుని గ్యాస్ పైపు నాబ్‌(Gas pipe knob)ను మూసివేయడం ద్వారా గ్యాస్ లీకేజీని ఆపడానికి ప్రయత్నించారు. పరిస్థితిని గమనించిన ఆ మహిళ ఏమాత్రం భయపడకుండా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించారు. సిలిండర్‌ను (Cylinder) వంటగది నుంచి హాల్‌లోకి తీసుకొచ్చారు.

    READ ALSO  Delhi Government | జూలై 1 నుండి ఆ వాహ‌నాల‌కు పెట్రోల్ బంద్.. ఢిల్లీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణయం

    అలాగే వంటగది , హాల్‌లోని తలుపులు, కిటికీలన్నింటినీ తెరిచి ఉంచారు. దీనివల్ల లీకైన గ్యాస్ చాలా వరకు బయటకు వెళ్లిపోయింది. కొంత సమయం తర్వాత ఆ మహిళ మరో వ్యక్తి సహాయంతో సిలిండర్‌ను పైకి లేపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. అయితే, అప్పటికే సిలిండర్‌ను ఇరుకైన వంటగది నుంచి విశాలంగా ఉన్న హాల్‌లోకి మార్చడం, తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మహిళ చూపిన ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు. గ్యాస్ లీకేజీ (Gas leakage) సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ నష్టం జరిగి ఉండేదని, మహిళ అప్రమత్తతే పెను ప్రమాదాన్ని తప్పించిందని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

    READ ALSO  Air India | ఏడు విమానాలు రద్దు చేసిన ఎయిర్​ ఇండియా

    Latest articles

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా...

    Today Gold Price | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధ‌ర ఎంత అంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో చెప్ప‌లేని...

    Pre market analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre market analysis : గ్లోబల్‌ మార్కెట్(Global markets)లో పాజిటివ్‌ మూడ్‌ కొనసాగుతోంది. గురువారం యూఎస్‌(US),...

    More like this