అక్షరటుడే, వెబ్‌డెస్క్: Funky Movie | విలక్షణ పాత్రలతో, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ హీరో విశ్వక్ సేన్ (Hero Vishwak Sen) మరో ప్రత్యేకమైన చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ‘ఫంకీ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న చిత్రం అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫిలిం ఇండస్ట్రీపై ఓ సెటైరికల్ డ్రామాగా చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఒక సినిమా దర్శకుడి పాత్రలో కనిపించబోతుండడం విశేషం. ఈ సినిమాను ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ చాలా అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నాడట.
Funky Movie | ఏం చేస్తారో మరి..
సినిమాకు సంబంధించి ఇప్పటికే చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. తాజాగా నిర్మాత నాగవంశీ (Producer Naga Vamsi) కింగ్‌డమ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫంకీ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “ఫంకీ అవుట్‌పుట్ చాలా బాగొచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ కయాదు లోహార్(Heroine Kayadu Lohar) డేట్స్ కోసం వేచి చూస్తున్నాం. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది.
ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది, అలాగే దర్శకుడు అనుదీప్(Director Anudeep)కి కూడా ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది అని నాగవంశీ స్పష్టం చేశారు. నాగవంశీ చేసిన కామెంట్‌తో ఫంకీ సినిమా(Funky Movie)పై హైప్ బాగా పెరిగింది.
సినిమా ఇండస్ట్రీలో ఉండే లోపాలను వినోదాత్మకంగా సెటైరిక్ పద్దతిలో చూపించబోతున్నట్లు ప్రకటించడంతో ఈ సినిమా గురించి సినిమా ఇండస్ట్రీలో కూడా చర్చ నడుస్తోంది. ఎవరిని టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నారు, ఏయే లోపాలని ఎత్తి చూపనున్నారు అని ముచ్చటించుకుంటున్నారు. సరైన హిట్స్ లేక కొన్నాళ్లుగా ఇబ్బందులు పడుతున్న విశ్వక్ సేన్ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు. చూడాలి మరి, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఇలాంటి సందేశం ఇస్తుందో.
ఆ మధ్య నాగ వంశీ.. నాగ్ అశ్విన్ బయోపిక్ అనే హింట్ కూడా ఇచ్చాడు. అనుదీప్ అనుకున్నది అనుకున్నట్టు స్క్రీన్ మీద చూపిస్తే మాత్రం అది మరో ‘గీత గోవిందం’ అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో హీరో డైరెక్టరు, హీరోయిన్ ఏమో ప్రొడ్యూసర్ కూతురు అని అన్నాడు.