అక్షరటుడే, వెబ్డెస్క్: Changur Baba | అతను ఒకప్పుడు సైకిళ్లపై తిరుగుతూ తాయత్తులు అమ్మేవాడు. కానీ ప్రస్తుతం కోట్లకు అధిపతి. మూడేళ్లలో విదేశాల నుంచి ఏకంగా రూ.500 కోట్ల నిధులు అందుకున్నాడు. మతమార్పిడులను వ్యాపారంగా చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్న చంగూర్‌బాబా లీలలు అన్నీ ఇన్ని కావు. విదేశాల నుంచి నిధులను సేకరించి అక్రమంగా మత మార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియాస్ చంగూర్‌బాబా (Jalaluddin alias Changur Baba) ఆట కట్టించేందుకు ఈడీ చర్యలు ప్రారంభించింది.
బలరాంపూర్ జిల్లా (Balrampur district) ఉత్రౌలా ప్రాంతానికి చెందిన చంగూర్బాబాతో పాటు ఆయన సహచరులు నీతూ రోహ్రను ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు (Uttar Pradesh Anti-Terrorism Squad police) ఈ నెల 5న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ కేసు మారుమోగుతోంది. చంగూర్‌బాబా మోసాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.
Changur Baba | ఆశ చూపి మత మార్పిడి..
చంగూర్‌బాబా ముఠా (Changur Baba gang) డబ్బు, ఉద్యోగాలు, చికిత్సల పేరిట పేదలు, హిందూ యువతులను మతం మార్చేవాడు. ముఖ్యంగా యువతులను ఇస్లాంలోకి మార్చేందుకు లవ్ ట్రాప్‌లు, బెదిరింపులకు వీరి గ్యాంగ్ పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. యూపీ ప్రభుత్వం అక్రమంగా నడిపిస్తున్న చంగూర్ బాబా ఆస్తులు, దర్గాలను కూల్చి వేసింది.
Changur Baba | రంగంలోకి ఈడీ
చంగూర్‌బాబా మత మార్పిడుల కోసం విదేశాల నుంచి నిధులు సేకరించినట్లు తేలడంతో ఈడీ రంగంలోకి దిగింది. నిందితుడి బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు చేపడుతోంది. ఆయన బ్యాంక్ ఖాతాలకు మూడునెలల్లో విదేశాల నుంచి రూ.ఏడు కోట్లు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. అతడికి భారత్, నేపాల్లో దాదాపు వంద వరకు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు సమాచారం. మూడేళ్లలో ఆయనకు రూ.500 కోట్ల విదేశీ నిధులు (500.cr foreign funds) అందగా.. అందులో రూ.300 కోట్లు అక్రమ మార్గాల్లోనే వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
Changur Baba | కీలక పత్రాలు స్వాధీనం
చంగూర్ బాబాకు చెందిన బలరామ్‌పుర్‌లోని విల్లాను ఇప్పటికే ఏటీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భవనంలోని పలు గదులను ఇప్పటికే కూల్చి వేశారు. అదే విల్లాకు తీసుకొచ్చి నిందితుడిని అధికారులు విచారించారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.