అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2025 : ఐపీఎల్ 2025 లో ఇషాన్ కిషాన్ ishan kishan తన క్రీడా స్ఫూర్తితో వృథా త్యాగం చేశాడు. ఉప్పల్ వేదికగా బుధవారం (ఏప్రిల్ 23) ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఔట్ కాకుండానే పెవిలియన్ కు చేరి ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు వరం ఇచ్చాడు.
దీపక్ చాహర్ deepak chahar ఇన్నింగ్స్ మూడో ఓవరు తొలి బంతిని లెగ్ సైడ్ వేశాడు. కిషాన్ ముందుకు జరిగి ఆడటంతో బాల్ అతని తొడకు తాకి వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. ఇక్కడే పెద్ద ట్విస్టు చోటుచేసుకుంది. హార్డిక్ నుంచి అప్పీల్ వచ్చినా.. కీపర్, బౌలర్ దగ్గర నుంచి ఎలాంటి అప్పీల్ రాలేదు.
అంపైర్ ఔట్ ఇద్దామా.. వద్దా.. అనుకుంటున్న సమయంలో కిషాన్ తల వంచుకొని పెవిలియన్ కు వెళ్లిపోతున్నాడు. ఈ తరుణంలో ఔట్ అంటూ అంపైర్ వేలు పైకి ఎత్తేశాడు. కిషాన్ తనకు తానుగా వెళ్లడం చూసి అంపైర్ ఔట్ అని ప్రకటించడం గమనార్హం.
అలా ఊహించని వచ్చిన వికెట్ చూసి ముంబై జట్టు ప్లేయర్స్ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత రిప్లేలో బంతి అల్ట్రా ఎడ్జ్ కు తాకలేదని నిర్ధారణ అయింది. కిషాన్ తీసుకున్న నిర్ణయంతో స్టేడియంలో ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. రెండో ఓవర్లో బోల్ట్ బౌలింగ్ లో కిషాన్ చక్కని సిక్సర్ కొట్టాడు. అలా 8 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు.
🚨 ISHAN KISHAN DISMISSAL MOMENT 🚨 pic.twitter.com/y75dm8v0bM
— Johns. (@CricCrazyJohns) April 23, 2025