అక్షరటుడే, వెబ్డెస్క్: Aghori Arrest | గత కొంతకాలంగా పలు వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న లేడీ అఘోరీని lady Aghori పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తనను అఘోరీ మోసం చేసిందని ఓ లేడి ప్రొడ్యూసర్ producer పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చీటింగ్ కేసు నమోదు చేసిన మోకిలా పోలీసులు mokila police అఘోరీని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ uttar pradesh సరిహద్దులో అఘోరీని అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఇటీవల వివాహం చేసుకున్న వర్షిణిని కూడా హైదరాబాద్ తీసుకు వస్తున్నారు.
రంగారెడ్డి rangareddy జిల్లా శంకర్పల్లి shankarpally మండలం ప్రొద్దుటూర్ మండలానికి చెందిన లేడీ ప్రొడ్యూసర్.. అఘోరీ చేసిన మోసంపై ఇటీవల మోకిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని ఫిర్యాదులో పేర్కొంది. పూజ కోసం రూ. పది లక్షలు తీసుకొని తనను మోసం చేసిందని సదరు మహిళా నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాకుండా మరో రూ.ఐదు లక్షలు కూడా అడిగిందని, ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అఘోరీని అరెస్టు చేశారు. కాగా ఇటీవల వర్షిణి కుటుంబ సభ్యులు సైతం అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.