అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sand Mining | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వం సీరియస్గా ఉన్నా దందా ఆగడం లేదు. అక్రమార్కులు జోరుగా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు. ఇలా అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక లారీలను అధికారులు సీజ్ చేశారు.
Sand Mining | కమ్మర్పల్లి మండల కేంద్రంలో..
కమ్మర్పల్లి మండల (Kammarpally mandal) కేంద్రంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య (CI Anjaiah) ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. భారత్ పెట్రోల్ బంక్ వెనుకల ప్రభుత్వ అనుమతి లేకుండా శనివారం రాత్రి సమయంలో ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నారు. వాటిని వెంటనే సీజ్ చేసి కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఎవరైనా ఇసుక అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.