అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : NH 44 | జాతీయ రహదారి National Highway 44పై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో joint Nizamabad district నాలుగు వంతెనలు Four bridges నిర్మించనున్నారు. ఈ మేరకు ఆయా పనులకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ Minister Nitin Gadkari శంకుస్థాపనలు చేశారు. తెలంగాణలో పర్యటించిన ఆయన.. హైదరాబాద్, కాగజ్ నగర్లో జరిగిన కార్యక్రమాల్లో పలు జాతీయ రహదారుల national highways ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు Hyderabad చేశారు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా joint Nizamabad district పరిధిలోని పలు పనులు కూడా ఉన్నాయి.
NH 44 | తప్పనున్న తిప్పలు
జాతీయ రహదారిపై ఉమ్మడి జిల్లా joint district పరిధిలో ఇటీవల సదాశివనగర్, టేక్రియాల్, పాత రాజంపేట శివారులో మూడు బ్రిడ్జిలను Three bridges నిర్మించారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో అండర్ పాస్‌లు నిర్మించాల్సి ఉంది. ఆయా పనులకు కేంద్ర మంత్రి Union Minister శంకుస్థాపన foundation చేశారు.
నిజామాబాద్ జిల్లా Nizamabad district పరిధిలో ముప్కాల్ చౌరస్తా, డిచ్పల్లి శివారులోని సీఎంసీ కాలేజీ CMC College సమీపంలో అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. సీఎంసీ వద్ద అండర్ పాస్ లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు Road accidents జరుగుతున్నాయి. ఈ క్రమంలో వంతెన నిర్మాణానికి bridge construction చర్యలు చేపట్టారు. ఈ రెండు వంతెనల కోసం రూ.80 కోట్లు కేటాయించారు.
కామారెడ్డి జిల్లా Kamareddy district సదాశివనగర్ ఇప్పటికే వంతెన నిర్మాణం పూర్తయింది. అయితే సర్వీస్ రోడ్డు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి bridge నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ నిర్మాణాలను రూ.19 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రతిపాదించారు. పద్మాజివాడి Padmajiwadi వద్ద రూ.28.2 కోట్లు, టేకిర్యాల్ వద్ద రూ.58.6 కోట్లతో అండర్ పాస్‌లు Underpasses నిర్మించనున్నారు. ప్రమాదాల నియంత్రణ కోసం అండర్‌పాస్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా Nizamabad district చంద్రాయన్పల్లి, గన్నారం, జక్రాన్‌పల్లి, బాలానగర్, తిర్మన్‌పల్లి, కామారెడ్డి జిల్లా Kamareddy district దగ్గి, కల్వరాల్ ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల వద్ద సర్వీస్ రోడ్లను service roads అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ పనుల కోసం రూ.18.4 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.