అక్షరటుడే, వెబ్డెస్క్ : Uppal Ex MLA | ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బండారి రాజిరెడ్డి bandari Raji Reddy కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం మృతి చెందారు.
2009-2014 వరకు రాజిరెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన మృతిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, ఉప్పల్ నియోజకవర్గానికి రాజిరెడ్డి చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. కాగా 1945లో జన్మించిన రాజిరెడ్డి కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. పలు జిల్లా స్థాయి పదవుల్లో పని చేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.