అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ISRO Former Chief | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) మాజీ ఛైర్మన్ కృష్ణస్వామి కస్తూరిరంగన్ (Kasturi rangan) మృతి చెందారు. బెంగళూరు(bengaluru)లోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్‌యూ JNU ఛాన్స్‌లర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. 1990-1994 వరకు యూఆర్‌ఎసీ డైరెక్టర్‌గా(URC Director) విధులు నిర్వహించారు. అనంతరం 1994-2003 వరకు ఇస్రో ఛైర్మన్‌గా ISRO Chairman బాధ్యతలు నిర్వహించారు.
2003–09 వరకు రాజ్యసభ సభ్యుడిగా Rajyasabha member కూడా రంగన్ ఆయన కొనసాగారు. 2004 నుంచి 2009 మధ్య బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. బీజేపీ BJP ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన దేశానికి అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో రంగన్‌ను సత్కరించింది.