అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి (Yashoda Hospital)లో అడ్మిట్ అయ్యారు. సీజనల్ ఫీవర్‌తో బాధ పడుతూ ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. కేసీఆర్‌కు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, సాధారణ చెకప్‌ల కోసమే హాస్పిటల్‌కు వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
