అక్షరటుడే, వెబ్‌డెస్క్: Forest Lands | ఆదిలాబాద్ జిల్లా (Adilabad district) ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మొక్కలు నాటడానికి అటవీ శాఖ అధికారులు (Forest department officials) ఆదివారం వెళ్లారు. ఫారెస్ట్ సిబ్బందిపై పోడు రైతులు రాళ్లతో దాడి చేశారు. ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులను పోడు రైతులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ వాహనాలు ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురు అధికారులు, పోలీసులకు గాయాలయ్యాయి. వారిని ఇచ్చోడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు.
Forest Lands | గతంలో సైతం
కేశవపట్నంలో గ్రామంలో (Kesavapatnam Village) గతంతో సైతం గ్రామస్తులు అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. జనవరిలో గ్రామంలో అటవీ అధికారులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఆ సమయంలో పలు ఇళ్లలో కలప దుంగలు, ఫర్నిచర్ దొరికింది. వాటిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు యత్నించగా.. గ్రామస్థులు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. అప్పుడు ఇద్దరు అటవీశాఖ సిబ్బంది గాయపడ్డారు.
Forest Lands | వరుస ఘటనలతో ఆందోళన
పోడు భూముల విషయంలో దాడులతో ఫారెస్ట్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. అటవీ భూములను కాపాడటానికి వెళ్తున్న తమపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో చాలా ప్రాంతాల్లో ఇలా అటవీ శాఖ అధికారులపై దాడులు జరిగాయి. నిజామాబాద్ జిల్లా (Nizamabad district) మోపాల్ మండలం కాల్పొల్ గ్రామంలో ఏడాది క్రితం అటవీ శాఖ అధికారులు దాడులు చేశారు. కామారెడ్డి జిల్లా (Kamareddy district)రాజంపేట మండలం షేర్ శంకర్ తండాలో అధికారులను అడ్డుకున్నారు. ఇలాంటి ఘటనలు తరుచు జరుగుతుండంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Forest Lands | కారణం ఏమిటి?
పోడు భూముల విషయంలో అటవీ శాఖ అధికారులపై దాడులకు కారణం రాజకీయ నాయకులు అనే చర్చ వినిపిస్తోంది. కొన్ని పార్టీలు పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటిస్తున్నాయి. దీంతో రైతులు ప్రతి ఏటా అడవులను నరుకుతూ చదును చేస్తున్నారు. ఎలాగు పట్టాలు వస్తాయనే ఆశతో అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల విషయంలో కూడా వివాదం ఉంది. దీంతో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు (revenue and forest officials) సంయుక్తంగా సర్వే నిర్వహించి పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.