More
    Homeబిజినెస్​Stock Market | ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌పై ఫారినోళ్ల ఫోకస్‌.. కెమికల్‌ స్టాక్స్‌నూ కొనేస్తున్న ఎఫ్‌ఐఐలు

    Stock Market | ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌పై ఫారినోళ్ల ఫోకస్‌.. కెమికల్‌ స్టాక్స్‌నూ కొనేస్తున్న ఎఫ్‌ఐఐలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు(Foreign Institutional Investors) ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్టార్‌తోపాటు కెమికల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ సెక్టార్లపై దృష్టి సారించారు. ఆయా రంగాల స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇదే సమయంలో పవర్‌(Power), ఐటీ రంగాల షేర్లను అమ్మేస్తున్నారు.

    స్టాక్‌ మార్కెట్‌లో(Stock market) ఫారిన్‌ ఇన్వెస్టర్లపై ఎక్కువ ఫోకస్‌ ఉంటుంది. వారు పెట్టే పెట్టుబడులు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయి. అందుకే ఎఫ్‌ఐఐలు(FII) నికర కొనుగోలుదారులుగా ఉన్నారా లేక అమ్మకందారులుగా మారారా అన్న విషయాన్ని దేశీయ ఇన్వెస్టర్లు గమనిస్తుంటారు. ఎఫ్‌ఐఐలు ఎక్కువగా నెట్‌ సెల్లర్లుగా ఉంటే మార్కెట్లు పడిపోయే అవకాశాలుంటాయి. ఫారినోళ్లు గత నెలన్నర రోజులుగా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(Financial services) సెక్టార్‌పై ఫోకస్‌ చేశారు. ఈ రంగంలో గతనెలలో రూ.4,028 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. ఈనెలలో 15వ తేదీ వరకు రూ.4,685 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు. కెమికల్స్‌(Chemicals), ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ సెక్టార్లపైనా బుల్లిష్‌గా(Bullish) ఉన్నారు. పవర్‌, కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌, ఐటీ తదితర రంగాల షేర్లు అమ్మేస్తున్నారు. ఈనెలలో రియాలిటీ రంగంపై ఎఫ్‌ఐఐలు ఫోకస్‌ చేశారు. గతనెలలో రూ.1,664 కోట్ల స్టాక్స్‌ అమ్మగా.. ఈనెలలో రూ. 431 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.

    READ ALSO  Stock Market | ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు

    టెలికాం(Telecom), కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్లపై తమ ధోరణి మార్చుకున్నారు. టెలికాం సెక్టార్‌లో గత నెలలో రూ. 8,089 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన ఎఫ్‌ఐఐలు.. ఈనెలలో 15వ తేదీనాటికి రూ. 887 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌ సెక్టార్‌లో గతనెలలో రూ. 575 కోట్ల స్టాక్స్‌ కొనుగోలు చేసి ఈనెలలో రూ.584 కోట్లు అమ్మారు. ఎఫ్‌ఎంసీజీ(FMCG) రంగంలో గతనెలలో రూ.815 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్న ఎఫ్‌ఐఐలు.. ఈనెల 15వ తేదీనాటికి రూ. 3,626 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు.

    మే 1 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Dometic stock market)లో ఏ రంగంలో ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఉపసంహరించారు అన్న వివరాలు..

    READ ALSO  Stock Market | వచ్చే వారంలో మార్కెట్ల పయనమెటు?

    Stock Market | ఎఫ్‌ఐఐ ఇన్‌ఫ్ల్సో..

    సెక్టార్‌ మే(రూ. కోట్లలో) జూన్‌ 15 వరకు(రూ. కోట్లలో)
    ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 4,028 4,685
    కెమికల్స్‌ 1,308 1,405
    ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 2,520 1,199
    క్యాపిటల్‌ గూడ్స్‌ 5,327 1,191
    రియాలిటీ 1,664 431
    సర్వీసెస్‌ 7,972 403

    Stock Market | ఎఫ్‌ఐఐ అవుట్‌ ఫ్ల్సో..

    సెక్టార్‌ మే(రూ. కోట్లలో) జూన్‌ 15 వరకు(రూ. కోట్లలో)
    పవర్‌ 2,492 3,120
    కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ 1,734 1,893
    ఐటీ 2,436 1,713
    కన్జూమర్‌ సర్వీసెస్‌ 49,11,461

    Latest articles

    Nizamabad City | కూలిన చెట్టు.. పట్టించుకోని అధికారులు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నగరంలో వారం రోజుల క్రితం భారీ ఈదురు గాలులకు పలుచోట్ల...

    MP Rahul Gandhi | ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    ఉమ్మడిజిల్లాలో రాహుల్​గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండల కేంద్రాల్లో, కాంగ్రెస్​ పార్టీ కార్యాలయాల్లో...

    IQOO New Phone | స్టైలిష్​ లుక్‌.. బిగ్​ బ్యాటరీ.. భారత్‌లో మరో కొత్త మోడల్‌ను లాంచ్‌ చేసిన ఐక్యూ..

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: IQOO New Phone | చైనా(China)కు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ వివో సబ్‌...

    Uttar Pradesh | ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త.. హోటల్ నుంచి దూకిన వివాహిత

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Uttar Pradesh | భర్తలను భార్యలు మోసగిస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగు చూస్తున్నాయి....

    More like this

    Nizamabad City | కూలిన చెట్టు.. పట్టించుకోని అధికారులు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నగరంలో వారం రోజుల క్రితం భారీ ఈదురు గాలులకు పలుచోట్ల...

    MP Rahul Gandhi | ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    ఉమ్మడిజిల్లాలో రాహుల్​గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండల కేంద్రాల్లో, కాంగ్రెస్​ పార్టీ కార్యాలయాల్లో...

    IQOO New Phone | స్టైలిష్​ లుక్‌.. బిగ్​ బ్యాటరీ.. భారత్‌లో మరో కొత్త మోడల్‌ను లాంచ్‌ చేసిన ఐక్యూ..

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: IQOO New Phone | చైనా(China)కు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ వివో సబ్‌...