అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Sagar Project)కు వరద పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 1,48,535 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 547.60 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది.
Nagarjuna Sagar | శ్రీశైలం గేట్ల మూసివేత
ఎగువన నుంచి కృష్ణానది(Krishna River)కి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ (Srisailam Project)కు ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతోంది. దీంతో అధికారులు జలాశయం మూడు గేట్లు మూసివేత మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 1,37,635 క్యూసెక్కుల వరద వస్తుండగా.. ఒక గేటు ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
మరోవైపు కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేపడుతున్నారు. దీంతో ప్రాజెక్ట్ నుంచి 94,497 క్యూసెక్కులు ఔట్ ఫ్లో నమోదు అవుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులకు చేరింది. గేట్లు మూసివేయడంతో నాగార్జున సాగర్‌కు సైతం ప్రవాహం తగ్గనుంది.
Nagarjuna Sagar | శాంతించిన గోదావరి
రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి(Godavari) శనివారం శాంతించింది. కాళేశ్వరం దగ్గర గోదావరి నదికి వరద తగ్గింది. మేడిగడ్డ వద్ద 7,25,050 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అన్ని గేట్లు తెరిచే ఉంచారు. దీంతో వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు వెళ్తోంది.