అక్షరటుడే, వెబ్డెస్క్: Kharge Tour | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం(LB Stadium)లో శుక్రవారం జరిగే సభలో పాల్గొననున్నారు. సామాజిక న్యాయ సమర భేరి పేరిట నిర్వహిస్తున్న ఈ సభకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేషన్ ఛైర్మన్లు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు హాజరు కానున్నారు.
ఈ సభ కోసం గురువారమే ఖర్గే హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్(PCC president Mahesh Goud) ఘన స్వాగతం పలికారు. అయితే ఖర్గే పర్యటన సందర్భంగా నగరంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది.
పలువురు గుర్తు తెలియని వ్యక్తులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు. రాత్రికిరాత్రి పలు ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందులో నినాదాలు రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని.. రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని ఫ్లెక్సీల్లో ఉంది.
రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట రాక్షస పాలన సాగుతోందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేగాకుండా ఇటీవల రైతులకు బేడీలు వేసిన చిత్రాలతో వాటిని ఏర్పాటు చేయడం గమనార్హం. ఫ్లెక్సీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.