అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nellore Accident | నెల్లూరు nellore accident జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
కొవ్వూరు మండలం kovvur mandal మండలం పోతిరెడ్డిపాలెంలోని ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఓ వెంకటరమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న ఆరుగురు వైద్య విద్యార్థులు medicos తీవ్రంగా గాయపడ్డారు. కాగా వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు.
వైద్య విద్యార్థుల్లో ఒకరి సోదరి నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా మృతులను అభిషేక్, నరేష్, జీవన్, విఘ్నేశ్, అభిసాయిగా గుర్తించారు. వీరు నారాయణ వైద్య కాలేజీలో narayana medical college ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.