అక్షరటుడే, వెబ్‌డెస్క్: Petrol Bunk | బైక్‌లో పెట్రోల్ పోస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో (Siddipet District) చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన బైక్‌లో పెట్రోల్ కొట్టించుకోవడానికి హుస్నాబాద్ (Husnabad) మండల కేంద్రంలోని బంక్ (Petrol Bunk)కు వెళ్లాడు. బంక్ సిబ్బంది బైక్‌లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చేలరేగాయి.
దీంతో అప్రమత్తమైన సదరు వ్యక్తి వెంటనే పెట్రోల్ గన్ను కింద పడేసి బైక్‌పై మంటలను ఆర్పివేశాడు. అనంతరం పెట్రోల్ గన్(Petrol Gun)కు మంటలు అలాగే ఉండగా.. సిబ్బంది పెట్రోల్ ఆఫ్ చేసి ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
View this post on Instagram