అక్షరటుడే, వెబ్‌డెస్క్: Actor Sriram : తమిళ సినీ పరిశ్రమ(Tamil film industry)లో డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్ కేసులో తమిళ నటుడు శ్రీరామ్‌ను సోమవారం చెన్నై నుంగంబాక్కం పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో సేలంలోని సంగకిరికి చెందిన ప్రదీప్ కుమార్(38), ఆఫ్రికా Africa లోని ఘనా Ghana కు చెందిన జాన్(38)ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 11 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ Nigerian జెరిక్, ఘనాకు చెందిన జాన్ నుంచి ప్రదీప్ కుమార్ కొకైన్ కొనుగోలు చేసి చెన్నైలోని అతడి స్నేహితుడు, రాజకీయ నేత ప్రసాద్‌తో సహా పలువురికి విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రదీప్ స్నేహితుడు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతడిని పోలీసులు విచారించగా.. పలువురు నటులు, నటీమణులకు డ్రగ్స్ అమ్మినట్లు అంగీకరించాడు. ప్రసాద్ సెల్ ఫోన్‌ను పరిశీలిస్తే.., నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్‌తో నిందితుడికి పరిచయం ఉన్నట్లు తేలింది. దీంతో శ్రీరామ్‌ను చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ పోలీసు (Chennai Narcotics Intelligence Police) లు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, అతను డ్రగ్స్ తీసుకున్నాడో.. లేదో.. నిర్ధారించడానికి రక్త నమూనాలను తీసుకున్నారు. వైద్య పరీక్షల్లో శ్రీరామ్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని సమాచారం.