అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Kavitha | ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కేశంపేట్ మండలం కాకునూరు గ్రామంలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళలందరికీ నెలకు రూ.2,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి (Congress leader Sonia Gandhi) పోస్టు కార్డులు పంపారు.
కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం హామీని అమలు చేయాలన్నారు. కోటీ మంది కోటీశ్వరులను చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇవ్వలేని సీఎం కోటీశ్వరులను ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయి గోస పడుతున్నామన్నారు. 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలన్నారు.
MLC Kavitha | పనులు చేయకున్నా బిల్లులు
కాంగ్రెస్ హామీల అమలు కోసం పోరాటాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ (Telangana) కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను కేసీఆర్ నిర్మించారన్నారు. 90శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంత రైతులకు సాగు నీరు వస్తుందన్నారు. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. కొత్తగా కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారని కవిత అన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో పనులు చేపట్టకముందే కమీషన్లు తీసుకొని కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చారని ఆమె ఆరోపించారు.
MLC Kavitha | కాంగ్రెస్ వారికే ఇందిరమ్మ ఇళ్లు
కాంగ్రెస్ నాయకులకే ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) ఇచ్చారని కవిత ఆరోపించారు. పేదలకు ఇళ్లు ఇవ్వాల్సి ఉన్నా.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారన్నారు. రాష్ట్రం పరువు తీసేలా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. అప్పు కోసం పోతే దొంగను చూసినట్లు చూస్తున్నారని వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీస్తున్నారు. ఇప్పటి వరకు రూ.రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్‌రెడ్డి ఒక ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హైడ్రా (Hydraa) పేదల గుడిసెల మీదకు మాత్రమే బుల్డొజర్లు తీసుకొని వెళ్తుందన్నారు. పెద్దొళ్ల దగ్గరికి పోయే దమ్ములేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాలు చేపట్టడం మాని ప్రజల కోసం పనులు చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు.