అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | బీసీల హక్కుల కోసం మున్ముందు పోరాటాలు ఉదృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (Narala Sudhakar) పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
సంఘం నగర అధ్యక్షుడిగా కొట్టూరు చంద్రకాంత్ మేరును నియమించారు. అనంతరం ఆయనను సంఘం నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local body elections) అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఆర్థికంగా బీసీలు బలపడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నగర నూతన అధ్యక్షుడిగా నియమితులైన చంద్రకాంత్ మేరు నగరంలో సంఘం బలోపేతానికి కృషి చేస్తారని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సంఘం తరఫున బీసీల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. సమావేశంలో సంఘం నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం గంగ కిషన్ మేరు, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, కరిపె రవిందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, అజయ్, చంద్రమోహన్, విజయ్, సాయి బసవ, చంద్రకాంత్, విజయ, సదానంద్, హన్మంత్ రావు, బాలన్న తదితరులు పాల్గొన్నారు.