అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ghana : ఘనా దేశంతో రక్షణ, భద్రతా రంగాల్లో కలిసి ముందుకు సాగుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Prime Minister Narendra Modi తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. పశ్చిమాసియ దేశం ఘనాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది.
దాదాపు మూడు దశాద్దాల తర్వాత ఘనా పర్యటనకు భారత ప్రధానిని ఆ దేశ అత్యున్నత గౌరవంతో సత్కరించింది. మోదీ విశిష్ట రాజనీతి, ప్రభావవంతమైన ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామా.. జాతీయ గౌరవ పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ (Order of the Star of Ghana)ను మోదీకి అందించారు. అనంతరం ఇరు దేశాల నేతలు పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సంస్కృతి, సాంప్రదాయ వైద్యం తోపాటు పలు రంగాల్లో సహకారాన్ని అందించే నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.
Ghana : పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం..
రాబోయే ఐదేళ్లలో భారత్- ఘనా దేశాలు వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఘనా పార్లమెంట్ (ghana Parliament)లో ప్రసంగించిన ప్రధాని.. ఈ గౌరవనీయమైన సభలో ప్రసంగించడం తనకు చాలా గౌరవంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రతినిధిగా 1.4 బిలియన్ల భారతీయుల శుభాకాంక్షలను తీసుకువచ్చానన్నారు.
ఘనాకు భారతదేశం కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఇరుదేశాలు కలిసి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్నారు. భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టులలో రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయని వివరించారు. ఘనాతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
Ghana : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు..
ఉగ్రవాదం మానవాళికి శత్రువని ఇరు దేశాలు స్పష్టం చేశాయన్న మోదీ.. ఉగ్ర ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. రక్షణ, భద్రతా రంగంలో ఇరుదేశాలు కలిసి ముందుకు సాగుతాయని మోదీ చెప్పారు. సాయుధ దళాల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సామాగ్రి సరఫరా, సైబర్ భద్రత తదితర రంగాల్లో భారత్-ఘనా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగనున్నదని తెలిపారు.