ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Collector | జ్వర బాధితులకు తక్షణమే చికిత్స అందించాలి

    Nizamabad Collector | జ్వర బాధితులకు తక్షణమే చికిత్స అందించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | తండాలో జ్వరాలు సోకిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna reddy) ఆదేశించారు. మోపాల్ మండలంలోని కల్పోల్ తండాలో (Kalpol Thanda) పలువురు జ్వరాల భారినపడిన విషయం తెలుసుకొని, ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వర పీడితుల వివరాలు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జ్వరాలు ప్రబలేందుకు గల కారణాలను గుర్తిస్తూ.. పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే స్థానికులు వైద్య శిబిరాన్ని (Medical camp) సందర్శించి తగిన చికిత్స పొందేలా చూడాలన్నారు.

    Nizamabad Collector | పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

    పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేను పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షించాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతాల నడుమ నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మురికి కాల్వలు, నీరు నిలువ ఉన్న ప్రదేశాల్లో దోమల నివారణ మందులు పిచికారీ చేయించాలని, ప్రతి ఇంటిని సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని పేర్కొన్నారు.

    READ ALSO  CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    Nizamabad Collector | పలు నివాసాల సందర్శన..

    కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తండాలోని పలు నివాసాలను స్వయంగా వెళ్లి పరిశీలించారు. పాత టైర్లు, ఇతర వస్తువులను గమనించి వాటిని నివాస ప్రదేశాలకు దూరంగా పారేయాలని స్థానికులకు సూచించారు. మరో వారం రోజులపాటు తండాలో వైద్య శిబిరం ఉంటుందని, జ్వరం ఇతర అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే శిబిరానికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ అధికారి (District Malaria Control Officer) డాక్టర్ తుకారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మోపాల్​ ఎంపీడీవో రాములు, ఎంపీవో కిరణ్ తదితరులు ఉన్నారు.

    కల్పోల్​ తండాలో పాడుబడ్డ టైర్లను పరిశీలిస్తున్న కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి

    READ ALSO  TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో భాగస్వాములు కావాలి: గవర్నర్​

    Latest articles

    Rajagopal Reddy | మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajagopal Reddy | మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు...

    Notam | పాక్ విమానాల‌పై నిషేధం పొడిగింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Notam | ప‌హాల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్తాన్ విమానాల‌పై నిషేధం విధించిన కేంద్రం.. ఆ...

    Fake Embassy | వీడు మాములోడు కాదు.. ఏకంగా నకిలీ రాయబార కార్యాలయం పెట్టేశాడుగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Embassy | నకిలీ సంస్థలు పెట్టి ప్రజలను మోసం చేయడం చూస్తుంటాం. గతంలో...

    KRCL Notification | పదో తరగతితో రైల్వేలో ఉద్యోగం.. వచ్చేనెల 12 వరకు దరఖాస్తు గడువు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: KRCL Notification | పదో తరగతి(Tenth class) విద్యార్హతతో రైల్వే శాఖలో ఉద్యోగం కోసం...

    More like this