అక్షరటుడే, వెబ్‌డెస్క్: Female principal and librarian fight : ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్, లైబ్రేరియన్ వాదులాడుకున్నారు. ప్రిన్సిపల్ బూతులు తిట్టడంతో లైబ్రేరియన్ తన ఫోన్‌లో రికార్డు చేయడం ప్రారంభించింది. ఆగ్రహించిన ప్రిన్సిపల్ ఆమెపై చేయిచేసుకుంది. లైబ్రేరియన్ ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టింది. అనంతరం ఇరువురు సిగపట్లతో ఊగిపోయారు. ఇష్టారీతిన కొట్టుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ (Madhya Pradesh Capital Bhopal)కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గోన్ Khargone ఏకలవ్య ఆదర్శ్ పాఠశాల (Eklavya Adarsh School)లో చోటుచేసుకుంది.
ప్రస్తుతం వీరి తగవు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రిన్సిపల్, లైబ్రేరియన్ బిగ్గరగా అరుచుకోవడం చూడవచ్చు. పాపం లైబ్రేరియన్ ను ప్రిన్సిపల్ చెంప మీద కొట్టింది. ఆమె సెల్ఫోన్ పగలగొట్టింది. జుట్టు పట్టుకుని లాగి అటుఇటు తోసేసింది.
లైబ్రేరియన్ కూడా ప్రిన్సిపల్ను ఎదుర్కొనే ప్రయత్నం చేసినా.. నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. చివరికి స్కూల్‌లో పనిచేసే ఆయా వారిని వారించి విడిపించింది. కాగా ఈ వీడియో వైరల్ కావడంతో ఆ ఇద్దరిని అధికారులు విధుల నుంచి తొలగించారు. అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు.