More
    Homeజాతీయంmovie story | కోతులపైకి గొడ్డలి విసిరిన తండ్రి.. తెగిన కుమారుడి మెడ.. సినిమా కథ...

    movie story | కోతులపైకి గొడ్డలి విసిరిన తండ్రి.. తెగిన కుమారుడి మెడ.. సినిమా కథ అల్లాడా..?

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: movie story : ఉత్తర్​ప్రదేశ్‌(Uttar Pradesh) మొరాదాబాద్‌లోని ఓ ఇంటి ఆవరణలో ఆరవ్ అనే రెండేళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో కోతుల గుంపు ఇంటి ఆవరణ(compound)లోకి వచ్చింది. కొడుకుపై ఎక్కడ దాడి చేస్తాయోనని భయపడిన బాలుడి తండ్రి లఖన్ సింగ్.. వాటిని తరిమేందుకు గొడ్డలి విసిరాడు.

    కానీ, ప్రమాదవశాత్తు ఆ గొడ్డలి(AXE) ఆరవ్‌కు తగిలింది. వేగంగా తగలడంతో పిల్లాడి మెడ తెగి, రక్తం ఎగజిమ్మింది. తీవ్రంగా గాయపడిన ఆరవ్​ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.

    కాగా, పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వకుండా బాలుడి మృతదేహాన్ని ఖననం చేశారు. బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

    READ ALSO  Cyber ​​Crime | రూ. 2 వేల కోట్ల సైబర్‌ మోసం.. ఏకంగా చైనాతో లింకులు!

    movie story : ప్రమాదమా..? హత్యనా..?

    ఈ ఘటనపై లఖన్ బావమరిది జితేంద్ర సింగ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇది ప్రమాదం కాదని, హత్య అని అయన ఆరోపించాడు. లఖన్ తన భార్య అనితతో నిత్యం గొడవ పడేవాడని చెప్పాడు. సోమవారం రాత్రి కూడా అనితను గదిలో బంధించి లఖన్ కొట్టినట్లు పేర్కొన్నాడు. మంగళవారం ఉదయం మళ్ళీ భార్యాభర్తలు గొడవ పడగా.. కోపంలో అక్కడే ఉన్న బాలుడు ఆరవ్​ను గొడ్డలితో నరికి చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    movie story : ఇక మరో కథనం ఏంటంటే..

    దీనిపై జిల్లా పంచాయతీ సభ్యుడు(Zilla Panchayat member) జగత్ సింగ్ సైని వివరణ ఇచ్చారు. లఖన్ ఇంట్లో ఇటీవలే టెంట్ వేశారని, ఇందుకోసం ఇంటి పైకప్పుపై ఇనుప రాడ్లు ఉంచారని వివరించారు. మంగళవారం ఉదయం వచ్చిన కోతుల గుంపు వాటిని పడవేయడం వల్ల.. అవి బాలుడిపై పడటంతో తలకు గాయమై మృతి చెందినట్లు చెప్పుకొచ్చారు. ఒకే ఘటనపై మూడు రకాల కథనాలు విన్న పోలీసులు.. తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. మరి ఏది నిజమో విచారణ(investigation)లో తేలనుంది.

    READ ALSO  Fake News | ఫేక్​ వార్తలు ప్రచారం చేస్తే ఇక జైలుకే..

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    More like this