More
    Homeఅంతర్జాతీయంCruise Ship | క్రూయిజ్ షిప్​ నుంచి పడిపోయిన కూతురు.. చిన్నారి కోసం సముద్రంలో దూకేసిన...

    Cruise Ship | క్రూయిజ్ షిప్​ నుంచి పడిపోయిన కూతురు.. చిన్నారి కోసం సముద్రంలో దూకేసిన తండ్రి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cruise Ship | డిస్నీ డ్రీమ్ క్రూయిజ్ నౌక(Disney Dream Cruise Ship)లో జూన్ 29న చోటుచేసుకున్న సాహసోపేత సంఘటన నెట్టింట వైరల్​గా మారింది. బహామాస్ నుంచి ఫ్లోరిడా(Florida) ఫోర్ట్ లాడర్‌డేల్‌కు వస్తుండగా నౌకలో ఉన్న నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు ఓ చిన్నారి సముద్రంలో పడిపోయింది. దాంతో వెంట‌నే ఆ చిన్నారి తండ్రి ఒక్కసారిగా ప్రాణాలకు తెగించి తానే కూడా సముద్రంలోకి దూకాడు. తన బిడ్డ ప్రాణాల కోసం సాగించిన తండ్రి పోరాటం ప్ర‌తి ఒక్కరిని క‌దిలించింది. తండ్రి సాహసం వల్లే ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది.

    Cruise Ship | పెద్ద రిస్కే..

    సముద్రపు అలల మధ్య దాదాపు 20 నిమిషాల పాటు తండ్రి తన కుమార్తెను నీటిపై తేలేలా పట్టుకుని ఉండడంతో, ముప్పు తప్పింది. ఇదే సమయంలో నౌక సిబ్బంది తక్షణమే స్పందించి, ఇద్దరినీ సురక్షితంగా క్రూయిజ్‌పైకి తీసుకువచ్చారు. డిస్నీ సంస్థ అధికారికంగా స్పందిస్తూ, “మా సిబ్బంది వేగంగా, నైపుణ్యంగా స్పందించారు. ప్రయాణికుల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యం,” అని తెలిపింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రయాణికులు ఆ తండ్రిని ‘రియల్ లైఫ్ హీరో’గా అభివర్ణించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన సాహసాన్ని కొనియాడుతూ.. “తన బిడ్డ కోసం ప్రాణాల మీదకు తెగించి దూకిన తండ్రి నిజమైన హీరో” అంటూ కొనియాడుతున్నారు.

    READ ALSO  Viral Video | పొడ‌వాటి పాముని మింగ‌డానికి ప్ర‌య‌త్నించిన బాలుడు.. వైర‌ల్ అవుతున్న వీడియో

    ప్రస్తుతం తండ్రీకూతుళ్లిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. ఈ సంఘటన తండ్రి ప్రేమ, త్యాగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అయితే రెయిలింగ్(Railing) దగ్గర కుమార్తెను తండ్రి ఫోటోలు తీస్తున్న స‌మ‌యంలో చిన్నారి నీళ్లల్లో పడిపోవడం చూశామని తోటి ప్రయాణికులు తెలిపారు. షిప్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సమాచారం అందించ‌డంతో వెంట‌నే సిబ్బంది వారిని రక్షించేందుకు రంగంలోకి దిగారు. లారా అమడార్ అనే ప్రయాణికురాలు ఈ ఘ‌ట‌న గురించి మాట్లాడుతూ.. షిప్ కొంత వేగంగా ప్రయాణిస్తోంది. అయితే నీళ్లల్లో పడిపోయినవాళ్లు మాకు చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తున్నారు. తర్వాత వాళ్లసలు కనిపించనేలేదు అని తోటి ప్రయాణికురాలు చెప్పారు. అయితే ప్ర‌మాదం గురించి తెలుసుకున్న కెప్టెన్ షిప్‌ వేగం తగ్గించి వెనక్కి తిప్పారు. సముద్రంలో పడిపోయిన తండ్రీకూతుళ్లను రక్షించేందుకు సహాయ సిబ్బంది ఓ చిన్న బోటు తీసుకొని వెళ్లి వారిద్దరినీ సురక్షితంగా పైకి తీసుకొచ్చారని డిస్నీ క్రూయిజ్(Disney Cruise) లైన్ ప్రతినిధి చెప్పారు.

    READ ALSO  Worlds Beautiful Places | ప్రపంచంలో అత్యంత అంద‌మైన దేశాలివే.. టాప్‌ 40లో లేని భార‌త్

    Latest articles

    Nizamabad Collector | భూ సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లాలో చేపట్టే రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి భూ...

    Nizamabad City | సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: మైనార్టీ కమిషన్ ఛైర్మన్​ తారిక్ అన్సారీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం...

    Prabhas Injury | ఫౌజీ సెట్‌లో ప్ర‌భాస్ కాలికి గాయం.. టెన్ష‌న్ ప‌డుతున్న ఫ్యాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Prabhas injury | స‌లార్ (Salaar), ‘కల్కి 2898 ఏ.డి.’ వంటి భారీ విజయాల తర్వాత...

    Hyderabad City | హైదరాబాద్‌లో భారీ వర్షం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad City | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా...

    More like this