అక్షరటుడే, వెబ్‌డెస్క్: Warangal : ఖమ్మం – వరంగల్ 563 నేషనల్ హైవే(National Highway 563)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district) మరిపెడ మండలం పరిధిలో ఉన్న రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. రెండు లారీలు ఢీ కొనడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు.
Warangal : బలంగా ఢీకొనడంతో..
కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్తున్న గ్రానైట్ లారీ.. విజయవాడ(Vijayawada) నుంచి వరంగల్(Warangal)కు చేపల దానా (fish feed) తీసుకొస్తున్న మరో లారీ ఢీకొన్నాయి. మరిపెడ పట్టణ శివారు కుడియా తండా వద్ద ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడడంతో రెండు లారీల క్యాబిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో రెండు లారీల్లోని ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ సజీవంగా దహనమాయ్యారు.
ముగ్గురి మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని విధంగా మారాయి. పోలీసులు POLICE ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను రాజస్థాన్(Rajasthan)కు చెందిన డ్రైవరు, క్లీనరు సర్వర్ రామ్, బర్గత్ అలీగా.. ఇంకో డ్రైవరును వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.