అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామను ఘోర రోడ్డు ప్రమాదం (Serious Road Accident) చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది.
ఈ ప్రమాదంలో కారులోని మాలోత్ చందులాల్(29), గగులోత్ జనార్దన్(50), కావలి బాలరాజు (40) అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. ఆయన కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంబర్ పేట్ (Amberpet) నుంచి బోంగ్లూర్ వైపు వెళ్తుండగా ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు (Hyderabad Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.