More
    HomeజాతీయంFarooq abdullah | కాంగ్రెస్‌పై ఫరూక్ అబ్దుల్లా విమ‌ర్శ‌లు.. ప్ర‌ధానిపై విమ‌ర్శ‌ల‌ను ఖండించిన మాజీ సీఎం

    Farooq abdullah | కాంగ్రెస్‌పై ఫరూక్ అబ్దుల్లా విమ‌ర్శ‌లు.. ప్ర‌ధానిపై విమ‌ర్శ‌ల‌ను ఖండించిన మాజీ సీఎం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Farooq abdullah | మిత్ర‌ప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా బుధవారం తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చేసిన “గయాబ్”ను తీవ్రంగా ఖండించారు. ఉగ్ర‌వాదుల‌పై చ‌ర్య‌ల‌కు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఇలా రాజకీయం చేయ‌డం త‌గ‌ద‌ని, ప్రధానమంత్రిని ప్రశ్నించడం ఇక‌నైనా మానుకోవాలని హిత‌వు ప‌లికారు. 26 మంది పౌరులను బలిగొన్న పహల్​గామ్​ ఉగ్రవాద దాడి తర్వాత ప్రధానమంత్రి కనిపించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మోదీని ఉద్దేశించి మంగ‌ళ‌వారం త‌న ఎక్స్ హ్యాండిల్‌లో “గయాబ్” అని ఓ ఫొటో పెట్టింది. నేరుగా మోదీ ఫొటో, పేరు లేక‌పోయిన‌ప్ప‌టికీ, ఆ ఆహార్యాన్ని బ‌ట్టి ప్ర‌ధానిని ఉద్దేశించే పెట్టింది. దీనిపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో కాంగ్రెస్ ఆ పోస్టును డిలీట్ చేసింది. ఈ వివాదంపై అబ్దుల్లా తాజాగా స్పందించారు.

    READ ALSO  Lalitpur Pharma Park | ఉత్తరప్రదేశ్‌లో లలిత్‌పూర్ ఫార్మా పార్క్‌కు శ్రీకారం.. ఐదు గ్రామాల్లో 1,472 ఎకరాల్లో అభివృద్ధి

    Farooq abdullah | మిత్ర‌ప‌క్షంపై విమ‌ర్శ‌లు

    జ‌మ్మూకాశ్మీర్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అబ్దుల్లా.. ఆ పార్టీ తీరుపై మండిప‌డ్డారు. మోదీపై కాంగ్రెస్ చేసిన విమ‌ర్శ‌ల‌ను ఖండిస్తూ ప్రధానమంత్రి ఢిల్లీలోనే ఉన్నారని, ఈ పరీక్షా సమయాల్లో ఆయన “తప్పిపోయిన” ప్రశ్నే లేదన్నారు. “ఆయన ఎక్కడ తప్పిపోయాడు? ఆయన ఢిల్లీలో ఉన్నారని నాకు తెలుసు” అని అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ కీలక సమయంలో ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలోనైనా తమ పార్టీ ప్రధానమంత్రికి పూర్తి మద్దతు ఇస్తుందని స్ప‌ష్టం చేశారు. “మేము ప్రధానమంత్రికి మా పూర్తి మద్దతు ఇచ్చాము. ఆ తర్వాత, మమ్మల్ని ప్రశ్నించకూడదు. ప్రధానమంత్రి తనకు అవసరమైన ఏ పని అయినా చేయాలి” అని అన్నారు.

    Farooq abdullah | పాక్‌పై మా వైఖ‌రి మారింది..

    పాకిస్తాన్ పట్ల తరచుగా మెతక వైఖరి అవలంబిస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్దుల్లా తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మొన్న‌టిదాకా తాను పాకిస్తాన్‌తో సంభాషణకు అనుకూలంగా ఉండేవాడినని, కానీ పొరుగు దేశం కాశ్మీర్‌లోని పహల్​గామ్‌లో మానవత్వాన్ని హత్య చేసిందని అన్నారు. “నేను ప్రతిసారీ పాకిస్తాన్‌తో చ‌ర్చ‌ల‌కు అనుకూలంగా ఉండేవాడిని.. కానీ ఆప్తుల‌ను వారిని కోల్పోయిన వారికి మనం ఏం సమాధానం చెబుతాము? మనం న్యాయం చేస్తున్నామా? బాలాకోట్ కాదు, నేడు ఈ రకమైన దాడులు ఎప్పుడూ జరగకుండా అలాంటి చర్య తీసుకోవాలని దేశం కోరుకుంటోంది” అని ఆయన అన్నారు.

    READ ALSO  Goa | గోవాలో కనిపించకుండా పోయిన భర్త.. తల్లి ఇంటికి చేరుకున్న భార్య‌.. పోలీసులను ఆశ్రయించిన యువకుడి తల్లి

    Latest articles

    Liquor Scam | విచారణ పేరుతో సిట్​ అధికారులు దాడి చేశారు.. చెవిరెడ్డి గన్​మెన్​ సంచలన లేఖ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Liquor Scam | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో లిక్కర్​ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ హయాంలో...

    Nizamabad City | బారికేడ్లు పడిపోయినా పట్టించుకోరా..?

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్​ను క్రమబద్దీకరించేందుకు పోలీస్​శాఖ (Nizamabad Police...

    Egypt | నిజంగా హ్యాట్సాఫ్‌.. ప‌ట్టాల‌పై ప‌డ్డ బిడ్డ‌ని ప్రాణాల‌కి తెగించి కాపాడిన తండ్రి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Egypt | ఈ రోజుల్లో క‌న్న‌బ‌డ్డ‌ల‌ని క‌నిక‌రం లేకుండా చంపేస్తుంటే, ఓ తండ్రి మాత్రం ప‌ట్టాల‌పై...

    G7 Summit | ఇజ్రాయెల్​కు మద్దతు ప్రకటించిన జీ7 దేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: G7 Summit | ఇరాన్​–ఇజ్రాయెల్(Iran–Israel)​ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియలో యుద్ధమేఘాలు అలుముకున్న విషయం తెలిసిందే. ఇరాన్​లోని...

    More like this

    Liquor Scam | విచారణ పేరుతో సిట్​ అధికారులు దాడి చేశారు.. చెవిరెడ్డి గన్​మెన్​ సంచలన లేఖ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Liquor Scam | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో లిక్కర్​ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ హయాంలో...

    Nizamabad City | బారికేడ్లు పడిపోయినా పట్టించుకోరా..?

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్​ను క్రమబద్దీకరించేందుకు పోలీస్​శాఖ (Nizamabad Police...

    Egypt | నిజంగా హ్యాట్సాఫ్‌.. ప‌ట్టాల‌పై ప‌డ్డ బిడ్డ‌ని ప్రాణాల‌కి తెగించి కాపాడిన తండ్రి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Egypt | ఈ రోజుల్లో క‌న్న‌బ‌డ్డ‌ల‌ని క‌నిక‌రం లేకుండా చంపేస్తుంటే, ఓ తండ్రి మాత్రం ప‌ట్టాల‌పై...