అక్షరటుడే, ఎల్లారెడ్డి: Farmers strike | ధాన్యాన్ని విక్రయించేందుకు paddy purchase రైతులు అష్టకష్టాలు పడుతుండగా.. ఇదే అదనుగా భావిస్తున్న రైస్‌మిల్లర్లు Rice millers తరుగు పేరుతో అన్నదాతలను నిండా ముంచుతున్నారు. ఒక లారీ నుంచి సుమారు 8 నుంచి 11 క్వింటాళ్ల ధాన్యాన్ని తరుగు పేరుతో దోచుకోవడంతో అన్నదాతలు formars రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు.
Farmers strike | నాగిరెడ్డిపేటలో రాస్తారోకో
నాగిరెడ్డిపేట Nagireddypet మండలం కేంద్రంలో గురువారం తరుగు పేరుతో లారీకి 11 క్వింటాళ్ల వరకు ధాన్యాన్ని తీస్తుండడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో హెచ్ఎంబీ జాతీయ రహదారిపై HMB National Highway బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఆయా గ్రామాల నుంచి పెద్దఎత్తున రైతులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు రైతులను సముదాయించారు.
Farmers strike | ప్రతి ఏడాది ఇదేతంతు..
ప్రతి ఏడాది తరుగు విషయంలో రైస్‌మిల్లర్లు rice millers nizamabad మోసాలకు పాల్పడుతూనే ఉన్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు మారినా తరుగు మోసాల్లో ఎలాంటి మార్పులు ఉండట్లేదని ఆగ్రహిస్తున్నారు. అధికారులు స్పందించాలని రైతులు వేడుకుంటున్నారు.