ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | అన్నదాత భూమి కబ్జా.. ఆందోళనతో ఆత్మహత్య

    Kamareddy | అన్నదాత భూమి కబ్జా.. ఆందోళనతో ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కబ్జాకు గురైన తన భూమి తిరిగి దక్కుతుందో లేదోనని బెంగతో కామారెడ్డి జిల్లాలో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన 26 గుంటల భూమి ఓ ముగ్గురు వ్యక్తుల కబ్జాలో ఉందని.. తన ఆత్మహత్యకు వారే కారణమని పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

    కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డికి 26 గుంటల భూమి ఉంది. అయితే ఆ భూమిని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల చుట్టూ తిరగ్గా సర్వే అధికారులు వచ్చి ఆ భూమి ముగ్గురి వ్యక్తుల కబ్జాలో ఉందని తేల్చారు. అయితే ఆ భూమి కోర్టు పరిధిలో ఉన్నట్టు సమాచారం. భూమి కబ్జా కావడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఆ రైతును వేధించసాగాయి. దీంతో తన భూమి దక్కుతుందో లేదోనన్న భయంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చనిపోయే ముందు తన చావు కారణమైన వారి పేర్లను సూసైడ్ నోట్​లో రాసి తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని పేర్కొన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Ongole | పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని కూతురుని చంపిన తల్లిదండ్రులు

    Latest articles

    Khilla jail | స్వతంత్ర సమరయోధులకు స్ఫూర్తి కేంద్రం ఖిల్లా జైలు

    అక్షరటుడే ఇందూరు: Khilla jail | తెలంగాణలోని వేలాదిమంది స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చిన కేంద్రం ఖిల్లా జైలు అని...

    Ration Cards | రేషన్‌కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్​ నాయకులు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Ration Cards | మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను కాంగ్రెస్​ నాయకులు...

    BHVL IPO | మార్కెట్​లోకి మరో ఐపీవో.. జూలై 24న ప్రారంభం కానున్న బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ సబ్​స్క్రిప్షన్​

    అక్షరటుడే, హైదరాబాద్: BHVL IPO | బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ లిమిటెడ్ (BHVL) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)...

    Mla Rakesh reddy | త్వరలోనే ఆర్మూర్​లో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన

    అక్షరటుడే, ఆర్మూర్​: Mla Rakesh reddy | ఆర్మూర్​ నియోజకవర్గంలో (Armoor Constituency) త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డి పర్యటన...

    More like this