అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Re-Release Movies | టాలీవుడ్లో ఇటీవల రీ రిలీజ్(Re-Release) ట్రెండ్ నడుస్తోంది. స్టార్స్ బర్త్ డేలు, లేదంటే మూవీ యానివర్సరీ సమయంలో అప్పట్లో ప్రేక్షకులను అలరించిన సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జులైలో కొత్త సినిమాల హడావుడి కన్నా.. రీ రిలీజ్ కానున్న పాత చిత్రాల హంగామానే ఎక్కువగా కనిపించనుంది. ఏకంగా ఆరు క్లాసిక్ చిత్రాలు తిరిగి థియేటర్స్(Theaters)లో సందడి చేయనున్నాయని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 2025 జులైలో థియేట్రికల్ రీ రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.
Re-Release Movies | ఏకంగా ఆరు రీరిలీజ్‌లు..
రీరిలీజ్ జాబితాలో ముందుగా చూస్తే.. ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ – జులై 7న విడుదల కానుంది. ధోని జీవిత నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయమే సాధించింది. ఇప్పుడు తిరిగి రీరిలీజ్ చేస్తున్నారు.
ఇక కుమారి 21ఎఫ్ – జులై 10న రీ రిలీజ్ కానుంది. ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ సాధించింది. రవితేజ నటించిన మిరపకాయ్ – జులై 11న విడుదల కానుండగా, ఈ సినిమా రవితేజ ఫ్యాన్స్‌కు మాంచి కిక్ అందించడం ఖాయం. ఆ తర్వాత గజిని (తమిళం) – జులై 18న విడుదల కానుంది. సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం.
ఇక సమంత, నాగ చైతన్య జంటగా నటించిన ఏ మాయ చేసావే – జులై 18న రీరిలీజ్ కానుంది. ఈ సినిమా సమయంలోనే నాగ చైతన్య, సమంత ప్రేమలో పడ్డారు. ఈ మూవీ వారిద్దరి కెరీర్‌లో ఇప్పటికీ స్పెషల్ అనే చెప్పాలి. ఇక వీడొక్కడే – జులై 19న రీరిలీజ్ కానుంది. ఈ సినిమాకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.
ఈ నెలలో రీరిలీజ్ కాబోతున్న చిత్రాలు బయోపిక్, రొమాన్స్, యాక్షన్, థ్రిల్లర్ లాంటి విభిన్న కథాంశంతో రూపొంది ప్రేక్షకులకి మంచి వినోదం పంచాయి. ఇందులో కొన్ని చిత్రాలు కల్ట్ క్లాసిక్స్(Cult Classics)గా నిలిచాయి. ఈ రీ-రిలీజ్‌ల ద్వారా పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకునే అవకాశం ఉండగా, కొత్తగా చూసే ప్రేక్షకులకు మాత్రం మొదటిసారి థియేటర్లో వీటిని ఆస్వాదించే అవకాశం లభించనుంది.