అక్షరటుడే, వెబ్‌డెస్క్:Hospitals | రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కాలేజీల్లో వైద్యులు, సిబ్బందికి ఫేస్ రికగ్నైజేషన్(Face Recognition) హాజరు అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా.. ఇది సత్వరమే అమల్లోకి వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.వేల కోట్ల నిధులు ఇస్తున్నా.. వైద్యులు(Doctors), సిబ్బంది(Staff) సకాలంలో రాకపోవడంతో, విధులకు డుమ్మాలు కొడుతుండటంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం(Government) ఫేస్ రికగ్నైజేషన్ హాజరు విధానం అమలు చేయాలని నిర్ణయంచింది. ఈ రోజు నుంచి (మే 1) ఈ విధానం అమలు కానుంది.
దీనిపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా (Damodara Rajanarasimha) సమీక్ష నిర్వహించారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. తాము అత్యవసర సేవలు చేస్తామని, ఎమర్జెన్సీ కేసులు (Emergency cases) ఉంటే అర్ధరాత్రి కూడా విధులకు వస్తామని వారు పేర్కొంటున్నారు. ఫీల్డ్ వర్క్(Field work)కు వెళ్తామని ఈ విధానం అమలు చేయొద్దని కోరారు. అయితే గురువారం నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది.