అక్షరటుడే, వెబ్‌డెస్క్: evaluation : దేశవ్యాప్తంగా 10వ తరగతి , ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. అందరూ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు పరీక్షల మూల్యాంకనం చివరి దశకు చేరుకుంది. కాగా, మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థుల వింత డిమాండ్లు తలనొప్పిగా మారాయి.
తాజాగా, కర్ణాటక(Karnataka)లోని బెళగావి జిల్లా(Belagavi district) చిక్కోడి( Chikkodi)లో (SSLC)10వ తరగతి పరీక్షల సమాధాన పత్రాలలో కొందరు ఉపాధ్యాయులకు వింత సమాధానాలు కనిపించాయి. విద్యార్థులు రాసింది చూసి వారు షాక్ అయ్యారు. తమను పాస్ చేయ్యాలని పిల్లలు ఉపాధ్యాయులకు డబ్బు ఆఫర్ చేశారు. వారు డిమాండ్లు రాసి, సమాధాన పత్రాలకు రూ. 500 జతపర్చిన విధానం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
పరీక్షలో సమాధానాలకు బదులుగా కొందరు విద్యార్థులు వింత రాతలు రాశారు. ‘‘సార్, దయచేసి నన్ను పాస్ చేయండి, ఇందుకోసం రూ.500 తీసుకోండి’’, ‘‘నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది సార్’’, ‘‘పాస్ చేయకపోతే నన్ను తల్లిదండ్రులు కాలేజీకి పంపరు’’ వంటివి అభ్యర్థనలు రాశారు.
మరో విద్యార్థి వింతగా.. ‘సార్, నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది’ అని, ‘నేను పాసైతే నా ప్రేమను కొనసాగిస్తా’ అంటూ తన సమాధాన పత్రంలో రాయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.