అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maruti Cars | ప్రయాణికుల భద్రత కోసం ఎర్టిగా(Ertiga), బాలెనో(Baleno) కార్లలో అదనంగా ఎయిర్ బ్యాగ్‌లను అమర్చాలని మారుతి సుజుకి(Maruti Suzuki) ఇండియా నిర్ణయించింది. ఈ మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చనున్నట్టు పేర్కొంది.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తరచూ కార్లలో భద్రత ప్రమాణాలను పెంచాలని సూచిస్తుంటారు. కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్‌ల(Air bags)ను అమర్చాలని పదేపదే కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతి సుజుకీ తన ఎర్టిగా, బాలెనో మోడళ్లలోనూ ఆరు ఎయిర్ బ్యాగ్‌లను అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ధరల పెంపును ప్రకటించింది.
రెండు రోజుల క్రితం వరకు ఎర్టిగా ధరలు రూ. 8.97 లక్షల నుంచి రూ. 13.25 లక్షలు, బాలెనో ధర రూ. 6.7 లక్షలనుంచి రూ. 9.92 లక్షలుగా ఉన్నాయి. కాగా.. ఎర్టిగా ఎక్స్ షోరూమ్ (Ex Showroom) ధర సగటున 1.4 శాతం, బాలెనో ధర 0.5 శాతం చొప్పున కంపెనీ పెంచింది. కొత్త ధరలు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి. ఈ సంవత్సరం చివరి నాటికి తమ అన్ని ప్యాసింజర్ వాహనాల (Passenger vehicles)కు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తామని కంపెనీ ప్రకటించింది.
ప్రస్తుతం మారుతి సుజుకి ఇండియా తన పది మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్ (Standard features)గా అందిస్తోంది. వీటిలో ఆల్టో కే10, సెలెరియో, వాగన్‌ఆర్, ఈకో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా వంటి మోడల్స్ ఉన్నాయి. ఎర్టిగా, బాలెనోలలోనూ ఆరు ఎయిర్ బ్యాగ్‌లు ఉండనున్నాయి.