అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs ENG : లార్డ్స్ టెస్ట్‌లో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాలని భావించిన టీమిండియా ఆశలు అడియాశలు అయ్యాయి. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్‌పై పట్టు బిగించిన టీమిండియా.. బ్యాటింగ్‌లో మాత్రం చతికిలపడింది.
193 పరుగుల సాధారణ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా Team India నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 17.4 ఓవర్లలో 4 వికెట్లకు 58 పరుగులు చేసి కష్టాలు పడింది. ఐదో రోజు ఇంగ్లండ్ గెలవాలంటే ఆరు వికెట్లు కావాల్సి ఉండగా, భారత్ విజయానికి కేవలం 135 పరుగులు మాత్రమే కావాలసి ఉంది. అయితే భారత్ గెలుపు పెద్ద కష్టం ఏమి కాదని అంతా అనుకున్నారు. కానీ ఇంగ్లండ్ బౌలర్స్ ఫస్టాఫ్‌లోనే వణుకు పుట్టించారు.
IND vs ENG : ఊరించి ఉసూరుమనిపించారు..
కీలక బ్యాట్స్‌మెన్స్ రిషబ్ పంత్ Rishabh Pant, కేఎల్ రాహుల్ kl rahul వికెట్లు వెంటవెంటనే పడిపోయాయి. ఆర్చర్ అద్భుతమైన బంతికి పంత్ 9 రన్స్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక అప్పటి వరకు బాగానే ఆడుతున్న కేఎల్ రాహుల్(39) KL Rahul బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
ఇక ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్‌ని కూడా స్టన్నింగ్ రీతిలో ఔట్ చేశాడు ఆర్చర్. సుందర్ బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడంతో బంతి గాల్లోకి లేచింది. అద్భుతమైన రీతిలో తన బౌలింగ్‌లోనే క్యాచ్ పట్టి సుందర్‌ని పెవిలియన్ చేర్చాడు ఆర్చర్. నితీశ్ కుమార్ రెడ్డి (13), జడేజా భాగస్వామ్యం.. కొంత వరకు వికెట్లు పడకుండా అడ్డుకున్నా సరిగ్గా లంచ్ కు ముందు నితీష్ రెడ్డి ఔట్ కావడంతో ఇండియన్స్ ఆశలు అడియాశలు అయ్యాయి.
ఇక జడేజా Jadeja (61 నాటౌట్) చాలా వరకు మ్యాచ్ గెలిచే ప్రయత్నం చేశాడు. జడేజాకి అండగా బుమ్రా( 5), సిరాజ్ (4) నిలిచారు. మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉన్నా చివర్లో బుమ్రా Bumrah, సిరాజ్ అనవసరంగా వికెట్స్ పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో 22 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది.
ఇక ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్(0), కరుణ్ నాయర్(14), శుభ్‌మన్ గిల్(6) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. నైట్ వాచ్‌మన్‌గా బరిలోకి దిగిన ఆకాశ్ దీప్(1) కూడా తక్కువ పరుగులే చేసి ఔటయ్యాడు. లార్డ్స్ లో గిల్ సేన చరిత్ర సృష్టిస్తుందని అందరు అనుకున్నారు. కాని ఆశలు అడియాశలు అయ్యాయి. కాగా, లార్డ్స్ మైదానంలో భారత్ అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ శాతం చాలా తక్కువ అనే చెప్పాలి.
1986లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు 136 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయం సాధించింది. 2014, 2021లో మాత్రమే భారత్ విజయాలు సాధించగా, ఆ రెండు విజయాలు కూడా ముందుగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని నిర్దేశించి గెలిచినవే.. మొత్తానికి రసవత్తర పోరులో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొనగా, చివరికి ఇంగ్లండ్ విజయం సాధించింది.