అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Kagar | మావోయిస్టుల అంతమే లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. 2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వర్షాకాలంలో మావోలకు నిద్ర లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. దీంతో ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని అడవులను బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ (Bijapur National Park) అటవీ ప్రాంతాన్ని సుమారు 25 వేల మంది బలగాలు, పోలీసులు చుట్టుముట్టాయి. నాలుగు రోజులుగా అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేపడుతున్నాయి. ఈ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు కూంబింగ్ చేపట్టారు. ముఖ్యంగా మావోయిస్టు కీలక నేత హిడ్మా (Hidma) టార్గెట్‌గా ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం.
Operation Kagar | కీలక నేత హతం
ఈ ఆపరేషన్ భాగంగా ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టుల స్నైపర్, కీలక నేత సోధీ కన్నా హతమయ్యాడు. తాజాగా మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇంకా ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. కాగా నేషనల్ పార్క్ ప్రాంతంలో కాల్పులు ఆపి పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Operation Kagar | చర్చలు లేవు
ఆపరేషన్ కగార్ (Operation Kagar)తో కకావికలం అయిన మావోయిస్టులకు ఇదివరకే తాము శాంతిచర్చలకు సిద్ధమని ప్రకటించారు. పౌర హక్కులు, కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఆపరేషన్ కగార్ ఆపి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్ర మాత్రం మావోయిస్ట్‌లతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఆయుధాలు వీడి లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని.. అంతకు మించి వారితో ఎలాంటి చర్చలు ఉండవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.