అక్షరటుడే, కామారెడ్డి: Dairy Course | డెయిరీ టెక్నాలజీ ద్వారా పాల ఉత్పత్తుల రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని దొడ్లే డెయిరీ సంస్థ సీఈఓ బి వెంకట కృష్ణారెడ్డి (Dodle CEO Venkata Krishna Reddy) అన్నారు.
కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాలలో శుక్రవారం (Kamareddy Dairy Technology College) వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు.
డెయిరీ కళాశాలలో చదివి స్థిరపడిన వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వెటర్నరీ వర్సిటీ వీసీ జ్ఞాన ప్రకాష్, రిజిస్ట్రార్ శరత్ చంద్ర, డెయిరీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌వి కృష్ణారెడ్డి, అసోసియేట్ డీన్ డా.సురేష్ రాథోడ్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.