అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tesla | టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Social media platform X founder Elon Musk) కు ఎదురుదెబ్బ తగలింది. అమెరికా(America)లో కొత్త పార్టీతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూడతానని ప్రకటించిన మస్క్కు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తనకు ఆర్థికంగా అండగా ఉన్న టెస్లా కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి.
ట్రంప్(US President Trump)తో వైరం మస్క్కు శాపంగా మారిందా.. అనే టాక్ నడుస్తోంది. కానీ, అంతకు ముందు ఇరువురి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు కూడా టెస్లా షేర్ల పరిస్థితి అదే విధంగా ఉంది. కానీ, ఈసారి మస్క్ కు భారీ నష్టం కలిగింది. ఈ ప్రపంచ వాణిజ్య కుబేరుడికి చెందిన టెస్లా షేర్లు ఒకే రోజు ఏకంగా 8 శాతం వరకు పడిపోయి తీవ్ర నష్టం కలిగించాయి.
Tesla | పెద్ద మొత్తంలో సంపద ఆవిరి..
ఎలాన్ మస్క్ తాజాగా ‘ది అమెరికన్ పార్టీ (The American Party)ని స్థాపించారు. కానీ మస్క్ తీసుకున్న నిర్ణయం పెట్టుబడిదారుల్లో ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఒక్క రోజులోనే టెస్లా కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.1.4 బిలియన్లకుపైగా ఆవిరైపోయింది.
Tesla | షేర్ ధర ఎంత తగ్గిందంటే..
టెస్లా షేరు ధర ఒకే రోజు భారీగా పతనం అయింది. ముందు రోజు 315.35 ఉన్న ధర 8 శాతం వరకు పడిపోయింది. షేరు ధర ఒక్క రోజులోనే 315 డాలర్ల నుంచి 291 డాలర్లకు పడిపోవడం గమనార్హం. గతేడాది డిసెంబరులో టెస్లా షేరు 488 డాలర్లతో జీవిత కాల గరిష్టానికి చేరుకుంది. అప్పుడు అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. అయితే అప్పటి నుంచి టెస్లా షేరు పడిపోతూనే ఉండటం గమనార్హం. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు షేరు ధర 35 శాతం పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు.
టెస్లా కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ మారుతూ వచ్చింది. ఈ నెలలో (జులై 4 నాటికి) 1.01 ట్రిలియన్ డాలర్లుగా మాక్రో ట్రెండ్స్ అంచనా వేసింది. కానీ, సోమవారం నాటికి మార్కెట్ క్యాప్ 946.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది టెస్లా మార్కెట్ విలువ 22 శాతం పడిపోవడం గమనార్హం. మస్క్ రాజకీయ పార్టీ వల్లనే టెస్లా వ్యాపారం భారీగా ప్రభావానికి గురైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.