అక్షరటుడే, వెబ్‌డెస్క్: ED Rights | ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫిట్ జీ(Coaching institute Fit G)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) సోదాలు చేసింది. ఆ సంస్థకు సంబంధించి ఎనిమిది చోట్ల తనిఖీలు చేపట్టింది. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుల ఆధారంగా ఢిల్లీ పోలీసుల(Delhi Police) ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్ఐఆర్(FIR) ఆధారంగా ఈడీ(ED) రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా అనేక ఫిట్ జీ కేంద్రాలు ముందస్తు నోటీసు లేకుండా అకస్మాత్తుగా మూసివేయబడ్డాయనే ఆరోపణలపై దర్యాప్తు కేంద్రీకృతమై ఉందని ఈడీ అధికారులు తెలిపారు.
ED Rights | ఫీజులు తీసుకుని మూసివేత..
ఫిట్ జీ ఇంజనీరింగ్(Fit G Engineering) అభ్యర్థులకు పోటీ పరీక్షలకు కోచింగ్ అందిస్తుంది. దానికి దేశవ్యాప్తంగా 73 కేంద్రాలు ఉన్నాయి. అయితే కోచింగ్ పేరిట విద్యా సంవత్సరానికి ముందుగానే తల్లిదండ్రుల నుంచి పూర్తి ఫీజు వసూలు చేసి ఫిట్ జీ(Fit G) ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా తమ సంస్థలను మూసివేసింది. దీంతో తల్లిదండ్రులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. లక్షల రూపాయలు ఫీజుగా డిపాజిట్ చేసినప్పటికీ తమకు ఎటువంటి ప్రయోజనం లేకపోగా, డబ్బును వాపసు చేయలేదని తల్లిదండ్రులు తెలిపారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోచింగ్ సెంటర్ల (Coaching Centers) నుంచి తీసుకున్న నిధులను వ్యక్తిగత లాభాలు, ఇతర సంస్థలకు మళ్లించడం అనుమానిస్తున్నారు. మనీ లాండరింగ్‌తో ముడిపడిన అంశాలుండడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులకు పాల్పడింది. ఫిట్ జీ ప్రమోటర్లలో ఒకరైన డీకే గోయెల్ Dk Goel సహా కీలక కుట్రదారుల నివాస స్థలాలు, కొన్ని కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, పొరుగున ఉన్న నోయిడా greater Noida, గురుగ్రామ్‌లోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రమోటర్ల (Coaching Institute Promoters) స్థలాలతో సహా సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.