అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mahesh Babu | సినీ హీరో మహేశ్‌బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్Enforcement Directorate (ఈడీ) నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ల Surana Group and Sai Surya Developers వ్యవహారంలో నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఈనెల 27న విచారణకు హజరు కావాలని ఆదేశించారు. ఇటీవలే సాయి సూర్య, సురాన గ్రూప్‌లలో ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఆయా సంస్థలకు సంబంధించిన యాడ్స్‌లో నటించినందుకు మహేశ్‌బాబు Mahesh Babu రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ప్రమోషన్స్ కింద రెండు కంపెనీల నుంచి నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ. 5.9 కోట్లు తీసుకున్నారని.. రూ. 3.4 కోట్ల నగదు, రూ. 2.5 ఆర్‌టీజీఎస్ RTGS ద్వారా పొందినట్లు ఈడీ అధికారులు ED officials గుర్తించారు. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాలని మహేశ్‌కుబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
Mahesh Babu | తనిఖీల్లో భారీగా నగదు..
సురానా గ్రూప్ Surana Group, సాయి సూర్య డెవలపర్లలో Sai Surya Developers ఈ నెల 16న ఈడీ చేపట్టిన తనిఖీల్లో భాగంగా బోయిన్‌పల్లిలోని Boynpally సురానా ఇండస్ట్రీస్ Surana Industries ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ Surana Industries అనుబంధ కంపెనీ, సాయి సూర్య డెవలపర్స్ Sai Surya Developers సంస్థ ఎండీ సతీశ్ చంద్రగుప్తా ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ seized చేశారు. సాయి సూర్య, సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వట్టి నాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు collecting money చేసి సతీశ్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కేసు Cyberabad Police case ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. సాయి సూర్య డెవలపర్స్‌పై విచారణ చేపట్టింది.
సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించింది. అలాగే, సురానా గ్రూప్ మూడు బ్యాంకులకు రూ. 3,986 కోట్లు ఎగ్గొట్టిన కేసులో సీబీఐ CBI మూడు కేసులు three cases నమోదు చేసింది. సురానా గ్రూప్ కంపెనీలలో ఈడీ రెండోసారి సోదాలు చేసింది. కంపెనీల ఇద్దరు ప్రమోటర్లు, ఇతర అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ కింద ఈడీ కేసు నమోదు ED registered case చేసింది. దీంతో కంపెనీ ఎండి దినేష్ చంద్ సురానా, విజయ్ రాజ్ సురానా, డమ్మీ డైరెక్టర్లు ఆనంద్ ప్రభాకరన్‌లను 2022లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా మరోసారి సురానా కంపెనీలలో సోదాలు చేయగా, మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 3,986 కోట్లు కుచ్చుటోపి పెట్టినట్లు తేలింది.