అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Greece Earthquake | వరుస భూకంపాలతో గ్రీస్ అతలాకుతలం అవుతోంది. బుధవారం రాత్రి గ్రీస్‌లోని కాసోస్ దీవి సమీపంలో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. భూకంప కేంద్రం 62.5 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే భూకంపం దాటికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ భూకంపం రావడంతో అధికారులు ముందస్తుగా సునామీ హెచ్చరికలు (tsunami warnings) జారీ చేస్తున్నారు. తీర ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయాలని సూచిస్తున్నారు.
