అక్షరటుడే, కామారెడ్డి: EAPSET | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College) ఈఏపీసెట్ (ఎంసెట్) (EAMCET) మొదటిదశ ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ డా. విజయ్ కుమార్ తెలిపారు. ఈ ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం వరకు కొనసాగుతుందన్నారు. కామారెడ్డి (kamareddy) చుట్టు పక్కల ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని.. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని కోరారు. ఈ పరిశీలనకు 823 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని తెలిపారు.
EAPSET | భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు ఎదగాలి..
ఎంట్రెన్స్ పరీక్షలో ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ డా. విజయ్ కుమార్ అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, విద్యనేర్పిన గురువులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. విద్యార్థులకు ధ్రువపత్రాల కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తూ ఈనెల 6 నుండి 10వరకు విద్యార్థులు తమకు నచ్చిన కళాశాల కోసం ఆప్షన్ ఇవ్వాలని, 18న మొదటి విడత సీట్ అలాట్మెంట్ జరుగుతుందని తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనలో అకడమిక్ కో–ఆర్డినేటర్ విశ్వప్రసాద్, వెరిఫికేషన్ ఆఫీసర్స్ అజహరొద్దీన్, ఫర్హీన్ ఫాతిమా, ఆఫ్రీన్ ఫాతిమా, ఆరె శ్రీలత, పవన్ కుమార్, సిబ్బంది కనకరాజు, నాగరాజు పాల్గొన్నారు.

విద్యార్థులకు కన్ఫర్మేషన్ లెటర్ అందజేస్తున్న ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్