అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Eagle Team | రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తామని ఇటీవల రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పేర్కొన్న విషయం తెలిసిందే. డ్రగ్స్ రహిత తెలంగాణ(Drugs-free Telangana) కోసం కొత్తగా ఈగల్ టీం ఆయన ఏర్పాటు చేశారు. ఎక్కడ డ్రగ్స్, గంజాయి కనిపించినా.. ఈగల్ టీం వాలిపోతుందని ఆయన తెలిపారు. డ్రగ్స్‌తో తెలంగాణ యువత(Telangana Youth) భవిష్యత్ నాశనం అవుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈగల్ టీం(Eagle Team) హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ముఠాల ఆట కట్టిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని కొంపల్లి మల్నాడు రెస్టారెంట్లో బుధవారం దాడి చేసిన విషయం తెలిసిందే.
Eagle Team | నోటీసులు జారీ
కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant) యజమాని సూర్య డ్రగ్స్ దందా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఈ మేరకు దాడులు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ డెలివరీ తీసుకుంటున్న సూర్య పలువురు ప్రముఖులకు వాటిని సరఫరా చేస్తున్నారు. అంతేగాకుండా పలు ప్రముఖ పబ్‌లకు కూడా డ్రగ్స్ అందిస్తున్నాడు. ఈ క్రమంలో ఈగల్ టీం సూర్య నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న తొమ్మిది పబ్‌లకు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
Eagle Team | డ్రగ్స్ పార్టీల ఏర్పాటు
డ్రగ్స్ దందాలో మల్నాడు ఓనర్ సూర్య(Malnadu Owner Surya) కీలకంగా వ్యవహరించాడు. పలువురు ప్రముఖులకు, పబ్‌లకు డ్రగ్స్ సరఫరా చేయడంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. నగర శివారులోని రిసార్ట్‌ల్లో, పబ్‌లలో సూర్య డ్రగ్స్ పార్టీలు(Drug Parties) అరెంజ్ చేసేవాడని ఈగల్ టీం గుర్తించింది. సూర్య నుంచి ప్రముఖ కార్డియాలజిస్ట్ 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేశారు.
Eagle Team | మూడు పబ్‌లతో కలిసి..
సూర్యకు మరో ముగ్గురు పబ్ యజమానులతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా నిర్దారించారు. డ్రగ్స్ పార్టీ కోసం ప్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్స్ కు చెందిన యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈగల్ టీం క్వాక్ పబ్ ఓనర్ రాజా శేఖర, కోరా పబ్ యజమాని పృథ్వి వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ ముగ్గురితో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు సూర్య పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఈగల్ టీం దర్యాప్తు వేగవంతం చేసింది.