అక్షరటుడే, ఇందూరు: Yoga Association | జిల్లా యువజన, క్రీడా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కుమార్‌ను (DYSO Pavan Kumar) శుక్రవారం యోగా అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు.
Yoga Association | క్రీడాభివృద్ధికి కృషి చేయాలి
జిల్లాల్లో క్రీడాభివృద్ధికి కృషి చేయాలని యోగా అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. నగరంలో సరైన క్రీడాస్థలం లేదని.. దీంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వపరంగా జిల్లాకు కావాల్సిన సౌకర్యాలు అందించే విధంగా చూడాలని వారు కోరారు. కార్యక్రమంలో న్యాయవాది రాజ్‌కుమార్ సుబేదార్ (Advocate Rajkumar Subedar), ఎక్సైజ్ సీఐ నగేష్(Excise CI Nagesh), అధ్యక్షురాలు ఐశ్వర్య, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, కార్యదర్శి గంగాధర్, కోశాధికారి కమలావాణి, లోహిదాస్, సంగీత తదితరులు పాల్గొన్నారు.