అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mohammed Siraj | ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (Second test match) భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం సాధించిన టీమిండియా (Team india), మూడో రోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (22 బంతుల్లో 6 ఫోర్లతో 28) దూకుడుగా ఆడి వెనుదిరిగాడు. ఆయన ఔట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ (Kl Rahul) (28 బ్యాటింగ్), కరుణ్ నాయర్ (7 బ్యాటింగ్) లతో కలిసి ఇంకొక వికెట్‌ను కోల్పోకుండా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. జోష్ టంగ్ ఒక వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం భారత్ మొత్తం ఆధిక్యం 244 పరుగులు.
Mohammed Siraj | గెలుస్తుందా..
అంతకు ముందు 77/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు (England team) తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్ (207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్‌లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్ (234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 158) అద్భుత శతకాలతో రాణించారు. ఈ ఇద్దరు 6వ వికెట్‌కు కలిసి 303 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యానికి ఆకాశ్ దీప్ అడ్డుకట్ట వేశాడు. హ్యారీ బ్రూక్‌ను బౌల్డ్ చేసి ఇంగ్లండ్ దూకుడుకు బ్రేక్ వేశాడు. భారత బౌలర్లలో ముహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) 6 వికెట్లతో చెలరేగాడు. ఆకాశ్ దీప్ 4 వికెట్లు తీయగా ఇంగ్లండ్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు భారత్ ఫోర్త్ డే ఆటలో మెరుగైన బ్యాటింగ్ చేస్తే, ఇంగ్లండ్‌కు 450 – 500 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. అలా చేస్తే గెలిచే అవకాశాలు మెరుగవుతాయి. కానీ 400లోపు లక్ష్యం నిర్దేశిస్తే మాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆ టార్గెట్ ఇంగ్లండ్ సులభంగా ఛేదించే అవకాశం ఉంది. కొత్త బంతితోనే బౌలర్లకు సహాయం లభిస్తోంది. తొలి టెస్ట్‌లో భారత్ (India frist test match) అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కూడా బౌలర్స్ పెద్దగా ప్రతిభ కనబరచకపోవడంతో టీమిండియా ఓటమి పాలైంది. మరి రెండో టెస్ట్‌లో ఏం చేస్తారో చూడాలి.