అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic stock markets) సోమవారం లాభాలతో ముగిశాయి.
నిఫ్టీ(NIfty) 25 వేల మార్క్ పైన స్థిరపడింది. ఉదయం 207 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్.. ఇంట్రాడేలో గరిష్టంగా 771 పాయింట్లు పెరిగింది. 66 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో గరిష్టంగా 226 పాయింట్లు లాభపడింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు(Investors) లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.
చివరికి సెన్సెక్స్(Sensex) 455 పాయింట్ల లాభంతో 82,175 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 25,001 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్‌ఈలో 2,301 కంపెనీలు లాభపడగా 1,772 స్టాక్స్(Stocks) నష్టపోయాయి. 194 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 107 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 42 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్(Lower circuit)ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ.2లక్షల కోట్లకు పైగా పెరిగింది.
Stock Markets | అన్ని సెక్టార్లూ లాభాల్లోనే..
అన్ని రంగాల(All sectors) షేర్లు రాణించాయి. బీఎస్‌ఈ(BSE)లో ఐటీ, ఆటో ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా పెరిగాయి. ఎఫ్‌ఎంసీజీ సూచీ 0.98 శాతం పెరగ్గా.. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.91 శాతం, మెటల్ ఇండెక్స్(Metal index) 0.87 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్ 0.80 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.75 శాతం లాభపడ్డాయి. పీఎస్‌యూ, పవర్, కన్జూమర్ డ్యూరెబుల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ఇండెక్స్‌లు అర శాతానికిపైగా పెరిగాయి.
Stock Markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో.. 8 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎంఅండ్‌ఎం 2.17 శాతం లాభపడగా.. నెస్లే(Nestle) 1.65 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.53 శాతం, టాటా మోటార్స్ 1.52 శాతం పెరిగాయి. ఐటీసీ, ఎల్‌టీ, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్ ఒక శాతానికిపైగా లాభపడ్డాయి.
Stock Markets | Top losers..
ఎటర్నల్(Eternal) అత్యధికంగా 4.51 శాతం నష్టపోయింది. అల్ట్రాటెక్ సిమెంట్ 0.47 శాతం, పవర్‌గ్రిడ్ 0.45 శాతం, సన్ ఫార్మా 0.45 శాతం, ఎన్టీపీసీ 0.32 శాతం నష్టపోయాయి.