అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Degree Exams | తెలంగాణ విశ్వవిద్యాలయం(Telangana University) పరిధిలో డిగ్రీ పరీక్షలకు హాల్టికెట్లను ఈనెల 14వ తేదీ నుంచి అందించనున్నారు. విద్యార్థులు తమ కళాశాలల్లో హాల్టికెట్లు పొందవచ్చని తెయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈనెల 16 నుంచి డిగ్రీ రెగ్యులర్ 2, 4, 6 సెమిస్టర్, బ్యాక్లాగ్ (2020 నుండి 2024 బ్యాచ్లకు) 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని చెప్పారు.
